డిసెంబర్ లో వైస్సార్సీపీ లోకి గంటా..?

Ganta Srinivasa Rao
The hour he wrote a letter to the Speaker once again on his resignation

టీడీపీ నేత , మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు వైస్సార్సీపీ పార్టీలోకి చేరేందుకు సిద్దమైనట్లు తెలుస్తుంది. గత కొద్దీ నెలలుగా గంటా వైస్సార్సీపీ లోకి వెళ్ళబోతున్నట్లు వార్తలు ప్రచారం అయ్యాయి..కానీ అది కుదరలేదు. కానీ ఈసారి మాత్రం పక్క అంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి తో గంటా భేటీ కాబోతున్నారు. ఈ భేటీ అనంతరం వైస్సార్సీపీ లోకి చేరే విషయాన్ని అధికారికంగా తెలుపబోతున్నట్లు సమాచారం.

2014 సార్వత్రిక ఎన్నికలలో విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గం నుంచి శాసనసభ్యునిగా ఎన్నికై చంద్రబాబు నేతృత్వంలో ఏర్పడిన మంత్రిమండలిలో స్థానం సంపాదించాడు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగిన గంటా ఎన్నికలకు ముందు టీడీపీలో చేరి మళ్ళీ మంత్రి పదవిని దక్కించుకున్నాడు.

1999లో రాజకీయాల్లో ప్రవేశించి తొలి ప్రయత్నంలోనే అనకాపల్లి నుంచి టీడీపీ ఎంపీగా గెలుపొందాడు. 2004 ఎన్నికల్లో చోడవరం ఎమ్మెల్యేగా విజయం సాధించాడు. 2009 ఎన్నికలకు ముందు పీఆర్పీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆ పార్టీ కాంగ్రెస్ లో విలీనమైనప్పుడు కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రిమండలిలో మంత్రి అయ్యాడు. 2014 ఎన్నికలకు ముందు తిరిగి టీడీపీలో చేరి భీమిలి ఎమ్మెల్యేగా గెలిచి మానవ వనరుల అభివృద్ధి, ప్రైమరీ ఎడ్యుకేషన్‌, సెకండరీ ఎడ్యుకేషన్‌, ఉన్నత, సాంకేతిక విద్యా శాఖల మంత్రిగా పని చేశాడు.