జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిలపై కేసు నమోదు

తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డిలపై కేసు నమోదైంది. ఈ నెల 23న తాడిపత్రిలోని మూడో వార్డు పర్యటనకు వెళ్లిన అస్మిత్‌రెడ్డి.. ఆయన అనుచరుడు ఖాదర్‌బాషా మరికొందరు.. అదే వార్డుకు చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై కవ్వింపు చర్యలకు పాల్పడి , కార్యకర్తపై దాడులకు పాల్పడ్డారు.
ఈ దాడుల్లో హాజీబాషా తీవ్రంగా గాయపడ్డారంటున్నారు. దీంతో జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి, జేసీ అస్మిత్‌రెడ్డి, అనుచరులు ఫిల్టర్ బీడీ యజమాని అయూబ్, ఖాదర్‌బాషాతో పాటు మరో పది మంది టీడీపీ నేతలపై 147, 148, 307, 506 రెడ్‌విత్ 149 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.