రాష్ట్రంలో అకాల వర్షం ఫై మంత్రి గంగుల ఆరా..

నిన్నటి వరకు ఎండలతో ప్రజలు అల్లాడిపోగా..ఈరోజు ఒక్కసారిగా వాతావరణం చల్లపడింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలో ఉదయం నుండి వర్షాలు దంచి కొడుతున్నాయి. ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో భారీగా వర్షం కురుస్తుంది. తెల్లవారుజామున 5.45 గంటల నుంచి మొదలైన వర్షం ఎడతెరపిలేకుండా కురుస్తున్నది. దీంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది.

అయితే భారీ వర్షానికి పలు మండలాల్లోని ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం తడిసిపోయింది. ఐకేపీ సెంటర్లలో ముమ్మరంగా కొనుగోళ్లు జరుగుతుండగా ధాన్యం పెద్ద ఎత్తున కేంద్రాలకు వస్తుంది. ఇప్పటికే కొనుగోలు చేసినదానితోపాటు, కేంద్రాల వద్ద ఇంకా కొనుగోలు చేయాల్సిన ధాన్యం కూడా భారీగానే ఉన్నది. ఇక కోతకు సిద్ధంగా చేలపై వరి సిద్ధంగా ఉన్నది. ఈ వర్షంతో చేను నేలబారి వడ్లు రాలే ప్రమాదం ఉన్నది. దీంతో ఈ అకాల వర్షం ఫై సివిల్ సప్లై శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆరా తీశారు. వర్షాల కారణంగా ఎఫెక్ట్ అయిన ధాన్యం కేంద్రాలపై సివిల్ సప్లై అధికారులు, జిల్లా కలెక్టర్ల నుండి మంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు.