#Biggboss5 నాగార్జున రెమ్యూనరేషన్ వైరల్

#Biggboss5 నాగార్జున రెమ్యూనరేషన్ వైరల్

బిగ్ బాస్ సీజన్ 5 గ్రాండ్ గా ఆదివారం ప్రారంభమైంది. మొత్తం 19 మంది సభ్యులతో బిగ్ బాస్ హౌస్ సందడి గా మారింది. షో మొదలైందో లేదో రకరకాల వార్తలు సోషల్ మీడియా లో ప్రచారం అవ్వడం స్టార్ట్ అయ్యాయి. ముఖ్యంగా సభ్యుల రెమ్యూనరేషన్ తో పాటు హోస్ట్ గా వ్యవహరిస్తున్న నాగార్జున రెమ్యూనరేషన్ గురించి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈసారి సభ్యుల్లో అత్యధికంగా షార్ట్ ఫిలిమ్స్ ఫేమ్ షణ్ముఖ్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడని అంటున్నారు. ఒకటి , రెండు కాదు ఏకంగా కోటి రూపాయిలు బిగ్ బాస్ ద్వారా అందుకోబోతున్నాడని అంటున్నారు. అలాగే కింగ్ నాగార్జున సైతం ఈ సీజ‌న్ కు 9 కోట్ల రూపాయ‌లు తీసుకుంటున్నాడ‌ట. కేవలం హోస్ట్ గా చేసిందందుకే కాదు బిగ్ బాస్ సెట్ ను అన్న‌పూర్ణ స్టూడియోస్ లోనే నిర్మించారు. రెండో సీజ‌న్ నుంచి ఇక్క‌డే నడిపిస్తున్నారు. కాబ‌ట్టి.. ఇటు భారీగా హౌస్‌ రెంట్ కూడా వ‌చ్చేస్తోంది. ఇలా రెండు రకాలుగా నాగార్జున కు బిగ్ బాస్ ద్వారా డబ్బులు అందుతున్నాయని మీడియా లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఇక మొదటి సీజన్ నుండి నాల్గో సీజన్ వరకు హోస్ట్ లుగా వ్యవహరించిన వారు ఎంత తీసుకున్నారంటే.. తెలుగు బిగ్ బాస్ షో మొద‌టి సీజన్ 2017లో మొదలైంది. మొదటి షో కు ఎన్టీఆర్ హోస్ట్ గా చేసి షో ఫై ఆసక్తి పెంచారు. ఒక్క ఎపిసోడ్ కు 40 ల‌క్ష‌ల చొప్పున తీసుకున్న ఎన్టీఆర్.. మొత్తంగా 8 కోట్ల మేర పారితోషికం అందుకున్నాడట. రెండో సీజన్ కు గాను నాని మూడు కోట్లు , మూడో సీజన్ కు నాగార్జున మూడున్న‌ర కోట్లు, నాల్గో సీజన్ కు 7 కోట్లు ..ఇప్పుడు ఐదో సీజన్ కు 9 కోట్లు తీసుకుంటున్నారనే వార్తలు ప్రచారం అవుతున్నాయి.