మరోసారి వరవరరావు బెయిల్‌ పొడిగింపు

ముంబయి: విరసం నేత వరవరరావు బెయిల్‌ను ముంబయి హైకోర్టు మరోసారి పొడిగించింది. దాంతో పాటు షరతులు కూడా కొనసాగించింది… తెలంగాణ రాష్ట్రానికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ వరవరరావు దాఖలు చేసిన పిటిషన్‌ను సెప్టెంబర్ 24వ తేదీకి వాయిదా వేసింది కోర్టు. సెప్టెంబర్ 24వ తేదీ వరకు ఇదే స్థితిని కొనసాగించాలని ఆదేశించింది. ఈ నెల 24వ తేదీ వరకు ముంబయిలోనే ఉండాలని స్పష్టం చేసింది.

కాగా, ఎల్గార్‌ పరిషద్‌ కేసులో తనకు మంజూరు చేసిన మెడికల్‌ బెయిల్‌ను పొడిగించాలంటూ విరసం నేత వరవరరావు ముంబయి హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలోని తన ఇంట్లో ఉండేందుకు అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇంకా తాను ఆరోగ్య సమస్యలతోనే బాధపడుతున్నానని, బెయిల్‌ మంజూరు చేస్తూ కోర్టు విధించిన ఒక్క షరతును కూడా తాను ఉల్లంఘించలేదని ఆయన గుర్తుచేశారు. ఈనేపథ్యంలో బెయిల్‌ షరతుల్లో కొంత సడలింపును పొందే అర్హత తనకు ఉందని వరవరరావు పేర్కొన్నారు.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/business/