టీ20 ప్రపంచకప్‌పై నీలినీడలు

వాయిదా పడవచ్చన్న ఆసీస్‌ కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌

aarone finch
aarone finch

సిడ్నీ: కరోనా కారణంగా ఇప్పటికే పలు రకాల క్రీడా టోర్నీలు వాయిదా పడ్డాయి. అయితే ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సిన టీ20 ప్రపంచకప్‌పై కూడా నీలినీడలు కమ్ముకున్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితి చూస్తుంటే టీ20 ప్రపంచకఫ్‌ కచ్చితంగా వాయిదా పడుతుందని ఆస్ట్రేలియా కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌ పేర్కొన్నాడు. అయితే ఇది ఎన్ని రోజులు వాయిదా పడుతుందని మాత్రం ఖచ్చితంగా చెప్పలేమన్నాడు. కాగా టిమిండియా మాజీ కెప్టెన్‌ సునిల్‌ గవాస్కర్‌ ఓ ప్రతిపాదనను తెరపైకి తెచ్చాడు. ఒకవేళ భారత్‌లో కరోరోనా పరిస్థితులు అదుపులోకి వస్తే టి20 ప్రపంచకప్‌ భారత్‌లో నిర్వహించాలని, అదే విధంగా వచ్చే సంవత్సరం భారత్‌లో జరగాల్సిన టి20 ప్రపంచకప్‌ను ఆస్ట్రేలియాలో నిర్వహించేలా పరస్పర మార్పిడి చేసుకోవాలని సూచించాడు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/