గుంటూరు జిల్లాలో వీఆర్వో అదృశ్యం

AP VRO subhani missing
AP VRO subhani missing

గుంటూరు: జిల్లాలోని సత్తెనపల్లిలో వీఆర్వో సుభానీ అదృశ్యం కలకలం సృష్టిస్తోంది. బొల్లపల్లి మండలం వెల్లటూరు వీర్వోగా పనిచేస్తున్న సుభానీ.. తనను తహశీల్దార్, మరో వీఆర్వో వేధిస్తున్నారంటూ సూసైడ్ నోట్ రాశాడు. ఇంటి నుంచి వెళ్లిపోయిన సుభానీ.. తన ఫోన్ స్విచ్‌ఆఫ్ చేసుకున్నారు. దీంతో అతని కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజులుగా అతని ఆచూకీ లభించలేదు. దీంతో అతని భార్య మిరాబీ సత్తెనపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/