వైస్సార్సీపీని నమ్ముకుని సర్వస్వం కోల్పోయానని కార్యకర్త ఆవేదన

వైస్సార్సీపీని నమ్ముకుని సర్వస్వం కోల్పోయానని ఓ కార్యకర్త ఆవేదన వ్యక్తం చేసాడు. పార్టీకి చెందిన నేతలంతా తనను వాడుకుని వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేసారు. వివరాల్లోకి వెళ్తే.. అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలోని యాడికి మండలానికి చెందిన వైస్సార్సీపీ కార్యకర్త సుదర్శన్ రెడ్డి..గత కొంతకాలంగా పార్టీ కి సేవ చేస్తూ వచ్చాడు. కాగా పార్టీ ని నమ్ముకుని తనకు ఉన్న ఆస్తినంతా అమ్ముకున్నానని సుదర్శన్ రెడ్డి వాపోయారు.
ఇదే విషయాన్ని పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తెలియజేస్తానని ఆయన చెప్పారు. కేవలం తన ఆవేదనను వ్యక్తం చేయడంతోనే ఆగిపోని ఆయన… యాడికి నుంచి అమరావతికి పాదయాత్ర ప్రారంభించాడు. తాడేపల్లిలో జగన్ను కలిసి పార్టీలో కింది స్థాయి కార్యకర్తలు పడుతున్న ఇబ్బందులను తెలియజేస్తానని సుదర్శన్ రెడ్డి తెలిపారు.