రాజకీయాల్లోకి అడుగుపెడుతున్న గడల శ్రీనివాస్..

కరోనా టైం లో కరోనా సూచనలు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ వార్తల్లో నిలిచినా తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మాజీ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస్..ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తున్నారు. ఈ విషయాన్నీ స్వయంగా ఆయనే ప్రకటించారు. ఇప్పటికే.. జీఎస్ఆర్ ఛారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి కొత్తగూడెంలో పలు సామాజిక సేవలు చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు. తాను ప్రజాక్షేత్రంలో ఉండాలనుకుంటున్నానని.. అందులోనూ తన మొదటి సేవ తన కులానికే చేస్తానని బహిరంగంగానే ప్రకటించారు. ఖమ్మం, సికింద్రాబాద్ ఎంపీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నుండి అప్లై చేసుకోవడం జరిగింది. ప్రజాస్వామ్య వాతావరణ ఉన్న పార్టీ కేవలం కాంగ్రెస్ పార్టీయే అన్నారు. నేను పోటీ చేసేందుకు నాకు అన్ని అర్హతలు ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ నమ్ముతుందని అనుకుంటున్నానని వెల్లడించారు.

ఇదిలా ఉంటే.. కరోనా సమయంలో గడల శ్రీనివాస్‌ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తించారు. అయితే.. ఎన్నికల ముందు గడల.. బీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ ఆశించారు. భద్రాచలం నుంచి టికెట్ ఆశించగా.. అప్పుడున్న సిట్టింగ్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్ రావుపై సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. మరోసారి.. సీఎంగా ఉన్న కేసీఆర్ కాళ్లు మొక్కి చర్చనీయాంశంగా మారారు. అయితే.. బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వకపోవటంతో.. సైలెంట్ అయిపోయారు.ఇక ఇప్పుడు కాంగ్రెస్ గూటికి చేరేందుకు సిద్ధమయ్యారు.