వైద్యరంగంలో నిధులు పెంచాలి

ప్రభుత్వ ఆసుపత్రులను పటిష్టం చేయాలి

Funding in the medical field
Funding in the medical field

వైద్యపరంగా మనం ఎంత వెనుకబడి ఉన్నామో మన ఆరోగ్య రంగం లోటుపాట్లను ఈ కరోనా మహమ్మారి బయట పెట్టింది.

కొన్ని దశాబ్దాలుగా దేశంలో వైద్య ఆరోగ్యరంగాన్ని నిర్లక్ష్యం చేసిన ఫలితం ఇప్పుడు కొట్టొచ్చినట్టు కనబడుతోంది.

చాలాచోట్ల ప్రభుత్వ ఆస్పత్రుల్లో కూడా పటిష్టమైన వైద్యసౌకర్యాలు లేవ్ఞ. ప్రధాన నగరాలైన ముంబయి, ఢిల్లీ, హైదరాబాద్‌ లాంటి చోట్ల ఉన్న ప్రధాన ఆస్పత్రుల్లో కూడా పటిష్టమైన వైద్యసౌకర్యాలు లేవు.

చికిత్స అందించడానికి సరిపడా వైద్యులు అందుబాటులో లేరు. ఇతర మౌలిక సదుపాయాల సంగతి ఇక చెప్పాల్సిన పని లేదని ఇటీవల పరిస్థితులు ప్రజలకు కళ్లకు కట్టాయి.

వీటిని అధ్యయన చేయడం జరిగింది. కనుక బేషజాలకు పోకుండా ఆస్పత్రుల్లో అధునాతన సౌకర్యాలను యుద్ధప్రాతిపదికన సమకూర్చాలి.

లాక్‌డౌన్‌ ముందునాటి స్థితితో పోలిస్తే కరోనా వైరస్‌ తీవ్రత అనూహ్యంగా పెరుగుతోంది. రోజుకోరీతిలో దాని లెక్కలు మారుతున్నాయి. మర ణాల సంఖ్య కూడా అలాగే పెరుగుతోంది.

దశలో గణాంకాలు చూసి విశ్లేషిస్తూ కేసుల సంఖ్య తక్కువగా ఉందనో లేక మరణాల రేటు తగ్గిందనో చెప్పడం సరికాదు. ప్రజల భయాందోళనలు తొలగించే ప్రయత్నాలు చేయాలి.

ఇది కేంద్ర రాష్ట్రాల సమిష్టి బాధ్యత. కేంద్రం నిధులిచ్చినా రాష్ట్రాలు సరిగా వినియోగించడం లేదన్న ఆరోపణలు పక్కన పెట్టి నిధులు ఎంత ఇచ్చిందీ సక్ర మంగా చెప్పి వాటిని రాష్ట్రాలు కరోనా నిర్మూలనకు ఉపయోగిస్తు న్నాయో లేదో తక్షణ చర్యలకు ఉపక్రమించాలి.

ఇకపోతే దేశవ్యా ప్తంగా కరోనా కేసుల ఉధృతి నేపథ్యంలో అన్ని రాష్ట్రాలను కలుపుకుని వైద్యసేవలను, చికిత్సలను పటిష్టం చేయాలి.

ప్రధాన ఆస్పత్రుల్లో సిబ్బందిని పెంచి, సౌకర్యాలు మెరుగుపర్చాలి. ఆస్ప త్రుల్లో ఫలానది లేదన్న విధంగా పటిష్టం చేసి ప్రజలకు నమ్మకం కలిగించాలి.

ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో కూడా వైద్యాన్ని ప్రభుత్వ అజ మాయిషీలోకి తీసుకుని రావాలి. ఇందుకు అవసరమైన నిధులను కేంద్ర,రాష్ట్రాలు ఖర్చు చేయాలి.

ప్రజల ఆరోగ్యంకన్నా మరేఇతర విషయాలు ముఖ్యంకాదు. కనుక వైరస్‌ను ఎదుర్కొనేందుకు అవ సరమైన ప్రాథమిక చికిత్సలకు సంబంధించి లోటు లేకుండా చేయాలి.

అవసరమైతే కొన్ని అనవసర పథకాలకు నిధులను ఆపివేయాలి.కరోనాను ఎదుర్కోవడంలో ఇంతవరకూ అనుసరిస్తూ వస్తున్న విధానాల వల్ల లభించిన ఫలితాలనూ, ముఖ్యంగా లాక్‌ డౌన్‌ తొలగించాక రాష్ట్రాలు పొందిన అనుభవాలనూ పరస్పరం పంచుకోవాలి.

మహమ్మారిని ఎదుర్కోవడానికి లాక్‌డౌన్‌ పర్య వసానంగా స్తంభించిన ఆర్థిక కార్యకలాపాలను పునరుద్ధరించడానికి అమలు చేస్తున్న వ్యూహాలను సమీక్షించుకోవాలి.

ఇప్పటికీ వ్యాధిగ్రస్తుల శాతం తక్కువగా ఉండటం, వేరే దేశాలతో పోలిస్తే వారిలో కోలుకునేవారి శాతం ఎంతో మెరుగ్గా ఉండటం వంటి విశ్లేషణలను పక్కన పెట్టాలి.

అసలు కరోనాను ఎదుర్కోవడమెలా అందుకు అనుసరించిన వ్యూహాలు విజయం సాధించాయా లేదన్న విశ్లేషణ చేయాలి.

కనీవినీ ఎరుగని రీతిలో విరుచుకుపడిన కరోనా వైరస్‌ను ఎదుర్కోవడంలో మనం పాటించిన విధానాల్లో శాస్త్రీ యత ఉందో లేదో తెలిసే అవకాశం లేదు. మనకే కాదు ప్రపంచంలో ఏ దేశానికి ఆ వ్యాధి విస్తృతిపై, తీవ్రతపై పూర్తి అవగాహన కలగడం లేదు.

వ్యాధి బయటపడిన చైనా కూడా లాక్‌డౌన్‌ ఎత్తేశాక పలుమార్లు మళ్లీ మళ్లీ విధించాల్సి వస్తోంది. ఆచరణలో ఎదురవు తున్న అనుభవాలను బట్టి ఎప్పటికప్పుడు దారులు పరుచుకుంటూ ముందుకుపోవడం తప్ప ఎవరికీ తమ విధానాలపైనా, వాటి ఫలితాలపైనా స్పష్టత లేదు.

ఇకపోతే ఎప్పుడు ఎదురవు తున్న ఆర్థికపరమైన ఇబ్బందుల్ని అధిగమించ డానికి కేంద్రం నేరుగా సాయం అందించాల్సి ఉంది.

ఇకపోతే వైద్యపరంగా మనం ఎంత వెనుకబడి ఉన్నామో మన ఆరోగ్య రంగం లోటుపాట్లను ఈ కరోనా మహమ్మారి బయటపెట్టింది.

కొన్ని దశాబ్దాలుగా దేశంలో వైద్య ఆరోగ్యరంగాన్ని నిర్లక్ష్యం చేసిన ఫలితం ఇప్పుడు కొట్టొచ్చినట్టు కనబడుతోంది.

చాలాచోట్ల ప్రభుత్వ ఆస్పత్రుల్లో కూడా పటిష్టమైన వైద్యసౌకర్యాలు లేవ్ఞ. ప్రధాన నగరాలైన ముంబయి, ఢిల్లీ, హైదరాబాద్‌ లాంటి చోట్ల ఉన్న ప్రధాన ఆస్పత్రుల్లో కూడా పటిష్టమైన వైద్య సౌకర్యాలు లేవు.

చికిత్స అందించడానికి సరిపడా వైద్యులు అందుబాటులో లేరు. ఇతర మౌలిక సదుపాయాల సంగతి ఇక చెప్పాల్సిన పని లేదని ఇటీవల పరిస్థితులు ప్రజలకు కళ్లకు కట్టాయి.

వీటిని అధ్యయన చేయడం జరిగింది. కనుక బేషజాలకు పోకుండా ఆస్పత్రుల్లో అధునాతన సౌకర్యాలను యుద్ధప్రాతిపదికన సమ కూర్చాలి.

ఈ విపత్కర సమయంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాల్సి ఉంది. కేంద్రం ఎప్పటికప్పుడు ఇస్తున్న మార్గ దర్శకాలను రాష్ట్ర ప్రభుత్వాలు పాటించాల్సిఉంది.

పరిస్థితి ఇంకా పూర్తిగా అదుపులోకి రాకపోగా, దాన్ని ఎదుర్కోవడానికి మరిన్ని చర్యలు అవసరమని ఈ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

వేగంగా వ్యాపిస్తున్న కరోనా వ్యాధి కారణంగా సామాన్యులు ఆందోళన చెందుతున్న వేళ ఆస్పత్రుల్లో కనీస సౌకర్యాలు లేకపోవడం అన్నది సిగ్గు చేటు. ఇంతటి భయంకర పరిస్థితుల్లో ఆస్పత్రులు అధ్వాన్నంగా ఉండటం క్షమించదగినది కాదు.

ఏ రాష్ట్రం అయినా ఆస్పత్రులను పటిష్టం చేసి అధునాతనంగా తీర్చిదిద్దాల్సిందే. ఇటువంటి స్థితిని ఎదుర్కోవడంలో ప్రభుత్వాధినేతలు ఒక సమగ్రమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించడంలో విఫలమ వుతున్నారు.

ఏ రాష్ట్రం అయినా ఆస్పత్రులను పటిష్టం చేసి అధునాతనంగా తీర్చిదిద్దాల్సిందే. ఇటువంటి స్థితిని ఎదుర్కోవడంలో ప్రభుత్వాధినేతలు ఒక సమగ్రమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించడంలో విఫలమ వుతున్నారు.

ఆయా ప్రభుత్వాలు ప్రజలతో వ్యవహరించే విషయం లో అనుసరిస్తూ వస్తున్న విధానాలు సరిగా ఉండటం లేదని తేలిపోయింది.

ఆస్పత్రులు పటిష్టంగా ఉంటేనే ఆరోగ్య రంగం ప్రాణాలు రక్షిస్తుందనే విశ్వాసం వైద్యరంగం మీద ఉంటుంది. ప్

రభుత్వం మీద ప్రభుత్వ విధానాల మీద ఆరోగ్య నిర్వహణా యంత్రాంగం మీద ప్రజలకు అపారమైన విశ్వాసం పెంచాల్సి ఉందని కరోనా నేపథ్యంలో మరోమారు రుజువైంది.

ఈ రంగం కోసం ఇప్పుడు ఎన్ని నిధులు అయినా పెంచాలి. అధ్వాన్నంగా తయారైన వైద్యరంగాన్ని సంస్కరించాలి. మనకు అవసరమైన ఉత్పత్తులను మనమే తయారు చేసుకునే స్థాయికి రావాలి.

స్వయం సమృద్ధి సాధించేలా వైద్యపరికరాలను ఉత్పత్తి చేసుకో వాలి. ఇంతగా శాస్త్రసాంకేతిక అభివృద్ధిచెందిన దశలో నైపుణ్యం ఉన్న యువతను వినియోగించుకుని ఆస్పత్రుల రూపురేఖలు మార్చాలి.

సిబ్బంది కొరత, ఉపకరణాల కొరత, బడ్జెట్‌ కొరత వంటి సమస్యలు లేకుండా చూసుకోవడం మినహా మనకు ఇప్పుడు ప్రాధాన్య అంశాలు ఇతరత్రా ఉండకూడదు.

పరిశీలకులు, నిపుణులు, కేంద్ర బృందం సభ్యులు, న్యాయ స్థానాలు పదేపదే చెబుతున్న వేళ కరోనా టెస్టులు సంఖ్యను పెంచాలి.

ప్రజలకు అనేక సందేహాలు, బాధ్యతలు ఉన్న నేపథ్యంలో వారికి భరోసా కల్పించడం ద్వారా కరోనాను సమిష్టిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎదుర్కోవాలి. అందుకు ఆస్పత్రులను పటిష్టం చేయడమే తక్షణ బాధ్యతగా అవసరంగా గుర్తించాలి.

  • డాక్టర్‌ ఎన్‌.కలీల్‌

తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/