మంత్రి మల్లారెడ్డిపై ఐదుగురు ఎమ్మెల్యేలు అసంతృప్తి

four-trs-mlas-decided-to-complaint-against-malla-reddy-to-cm-kcr

హైదరాబాద్‌ః మంత్రి మల్లారెడ్డిపై ఐదుగురు ఎమ్మె్ల్యేలు అసమ్మతి గళం ఎత్తారు. ఆయన ఏకపక్ష నిర్ణయాలతో విసిగిపోతున్నామని ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, మాధవరం కృష్ణారావు, వివేక్, మైనంపల్లి, బేతి సుభాష్ రెడ్డి వాపోయారు. ఈ క్రమంలో మైనంపల్లి నివాసంలో సమావేశమైన ఐదుగురు నేతలు మల్లారెడ్డి అంశాన్ని సీఎం కెసిఆర్, మంత్రి కెటిఆర్ దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు.మంత్రి పెత్తనం పై ఫిర్యాదు చేస్తామని చెప్పారు.

మల్లారెడ్డి కారణంగా మేడ్చల్ జిల్లాలోని పదవులన్నీ మేడ్చల్ నియోజకవర్గానికి మాత్రమే పరిమితమవుతున్నాయని ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు. ఆదివారం మార్కెట్ కమిటీ ఛైర్మన్ విషయం కెటిఆర్ వరకు వెళ్లిందని, రాత్రికి రాత్రే జీవో పాస్ చేసి భాస్కర్ యాదవ్ అనే వ్యక్తితో ప్రమాణ స్వీకారం చేయించాడని మైనంపల్లి ఆరోపించారు. మంత్రి మల్లారెడ్డి అవకాశం ఇచ్చిన వ్యక్తులకే మళ్లీ మళ్లీ పదవులు కట్టబెడుతూ పంతం నెగ్గించుకుంటున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/news/national/