టీడీపీ నేత‌ల‌పై అక్రమ కేసులు బనాయిస్తున్నారు

చట్టాన్ని అతిక్రమించి వ్యవహరించిన పోలీసుల‌పై చర్యలు తీసుకోవాలి: లోకేశ్

అమరావతి: టీడీపీ నేత నారా లోకేశ్ వైస్సార్సీపీ ప్ర‌భుత్వం, పోలీసుల‌పై మండిప‌డ్డారు. పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గం పరిధిలో జ‌రిగిన ఓ ఘ‌ట‌న‌ను ఆయ‌న ప్ర‌స్తావించారు. ‘ఖాకీ చొక్కా తీసేసి వైస్సార్సీపీ చొక్కా తొడుక్కున్న కొంతమంది పోలీసులు బరితెగించి ప్రవర్తిస్తున్నారు. ఒడ్డు దాటాక సొంత కుటుంబ సభ్యులను సైతం దూరం పెట్టే వైస్సార్సీపీ వాళ్ల‌ను నమ్ముకొని అక్రమ కేసులు బనాయిస్తున్న కొంతమంది పోలీసులు, చట్టవ్యతిరేకంగా చేస్తోన్న తప్పులకు మూల్యం చెల్లించక తప్పదు’ అని ఆయ‌న హెచ్చ‌రించారు.

‘పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గం పరిధిలో టీడీపీ జడ్పీటీసి అభ్యర్థిగా పోటీ చేశారనే అక్కసుతో గంధం జగన్నాథం గారిపై అక్రమ కేసులు బనాయించి వేధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను’ అని లోకేశ్ ట్వీట్ చేశారు. ‘వైస్సార్సీపీ నాయకుల ప్రోద్బ‌లంతో పెట్టిన కేసులు వెంటనే ఎత్తెయ్యాలి. చట్టాన్ని అతిక్రమించి వ్యవహరించిన స్థానిక ఎస్ఐపై చర్యలు తీసుకోవాలి’ అని లోకేశ్ డిమాండ్ చేశారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/