శ్రీలంకకు 3.3 టన్నుల వైద్య సామాగ్రిని పంపిణీ చేసిన భారత్

India delivers 3.3 tons of essential medical supplies to Sri Lanka

కొలంబో: శ్రీలంకలోని ఉచిత ప్రీ-హాస్పిటల్ కేర్ అంబులెన్స్ సేవకు ఇండియా 3.3 టన్నుల వైద్య సామాగ్రిని అందజేసింది.దాంతో శ్రీలంక కి ఇచ్చిన మాట‌ని నెర‌వేర్చుకుంది..విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్. S. జైశంకర్ తన మార్చి పర్యటనలో @1990SuwaSeriya ఎదుర్కొన్న మందుల కొరతను పరిశీలించారు. దాంతో నేడు హైకమిషనర్ 3.3 టన్నుల వైద్య సామాగ్రిని అందజేశారు. ఈ మేర‌కు కొలంబోలోని భారత హైకమిషన్ ట్విట్టర్‌లో ఒక ప్రకటన విడుదల చేసింది. గత రెండు నెలల్లో భారతదేశం నుండి SLR 370 మిలియన్లకు పైగా వైద్య సహాయాన్ని అంద‌జేశారు. సువా సేరియా అంబులెన్స్ సర్వీస్ 2016లో భారతదేశం నుండి USD 7.6 మిలియన్ల నిధులతో ప్రారంభించబడింది. భారతదేశం కూడా ఈ సేవకు ఉచిత అంబులెన్స్‌లను అందించింది.. ఇది ప్రస్తుతం శ్రీలంకలోని అన్ని ప్రావిన్సులలో పనిచేస్తుంది.. COVID 19కి వ్యతిరేకంగా దేశం చేస్తున్న పోరాటంలో కీలకమైనది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/national/