యుద్ధం ఆగాలని ‘అనంత’లో విదేశీయులు శాంతి హోమం

భగవాన్ సత్యసాయి బాబా, దుర్గా దేవి ఆలయాల్లో పూజలు

Foreigners worshiping peace to stop the war
Foreigners worshiping peace to stop the war

రష్యా, ఉక్రెయిన్ ల మధ్య యుద్ధాన్ని విరమించి శాంతి బాటలో పయనించాలని అనంతపురం జిల్లా లో విదేశీయులు ప్రత్యేక హోమం జరిపారు. ప్రపంచ శాంతి నెలకొనాలని భగవాన్ సత్యసాయి బాబాను, దుర్గాదేవిలను వేడుకుంటూ శాంతి హోమం నిర్వహించారు. తాజాగా ఇక్కడి పుట్టపర్తిలో విదేశీయులు హోమం నిర్వహించారు. ప్రపంచంలో శాంతి నెలకొనాలని ప్రార్థిస్తూ దుర్గాదేవి ఆలయంలో శాంతి హోమం జరిపించారు. .యుద్ధం త్వరగా పరిసమాప్తం కావాలని ప్రపంచ మానవాళి సుఖసంతోషాలతో వర్థిల్లాలని కోరుకున్నారు. వేద పండితుడు ప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో ఈ హోమం జరిపారు.

అంతర్జాతీయ వార్తల కోసం :https://www.vaartha.com/news/international-news/