ఈ-మార్కెటింగ్ ప్లాట్ ఫాంపై సిఎం జగన్‌ సమీక్ష

పంటల మ్యాపింగ్ చేయాలని అధికారులకు సూచన

jagan mohan reddy
jagan mohan reddy

అమరావతి: సిఎం జగన్‌ ప్రణాళిక, ఈ-మార్కెటింగ్ ప్లాట్ ఫాంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆర్బీకే పరిధిలో ఏ పంటలు వేయాలన్నదానిపై మ్యాపింగ్ చేయాలని అధికారులకు సూచించారు.ఈ-క్రాపింగ్ పై మార్గదర్శకాలు, ఎస్ పీవోలను రూపొందించాలని స్పష్టం చేశారు. ఈక్రాపింగ్ విధానాలను గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల్లో ఉంచాలని పేర్కొన్నారు. జిల్లా, మండల స్థాయుల్లో వ్యవసాయ సలహా బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మార్కెట్లో గిరాకీ లేని, మార్కెటింగ్ చేయలేని పంటలు వేస్తే రైతులు నష్టపోతారని తెలిపారు. 30 శాతం పంటలను కొనుగోలు చేయాలని నిర్ణయించామని సీఎం జగన్ వెల్లడించారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/