ఎయిర్‌టెల్‌కు భారీ షాక్‌

ఎయిర్‌టెల్‌ను బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టిన డీజీఎఫ్‌టీ

airtel
airtel

న్యూఢిల్లీ: భారీ నష్టాలకు తోడు ఇటీవలి ఏజీఆర్‌ వివాదంతో ఇబ్బందులు పడుతున్న ప్రముఖ టెలికాం సంస్థ భారతి ఎయిర్‌టెల్‌కు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఎక్స్‌పోర్ట్‌ ఆబ్లిగేషన్స్‌కు అనుగుణంగా ప్రవర్తించలేదన్న ఆరోపణలతో డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ భారతి ఎయిర్‌టెల్‌ను బ్లాక్ లిస్ట్ లో పెట్టింది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎగుమతుల ప్రోత్సాహక పథకాల (ఇపీసీజీ) పథకం కింద ఎగుమతి నిబంధలను నెరవేర్చకపోవడంతో భారతి ఎయిర్‌టెల్‌ను విదేశీ వాణిజ్య రెగ్యులేటరీ ఈ జాబితాలో చేరింది. ఎగుమతి ప్రోత్సాహక మూలధన వస్తువుల పథకం కింద ఎగుమతి బాధ్యతను నెరవేర్చడంలో ఎయిర్‌టెల్ విఫలమైందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దీంతో ఎయిర్‌టెల్‌ను తిరస్కరించిన ఎంట్రీ లిస్ట్ లో ఉంచినట్లు తెలిపాయి. దీంతో కంపెనీలు తమ దిగుమతి లైసెన్స్‌ను కోల్పోతాయి. మరోవైపు అవసరం లేని కారణ​గా 2018 ఏప్రిల్ నుండి అలాంటి లైసెన్స్ తీసుకోలేదని ఎయిర్‌టెల్‌ వివరించింది. అయినప్పటికీ గత లైసెన్సులన్నీ ముగిసిన నేపథ్యంలో కొత్త లెసెన్స్‌ కోసం ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నామని తెలిపింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/