అక్రమంగా తరలిస్తున్న విదేశీ కరెన్సీ స్వాధీనం

హైదరాబాద్ : శంషాబాద్‌ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న విదేశీ కరెన్సీని బుధవారం కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారు. ఇండిగో 6ఈ1405 ద్వారా షార్జా వెళ్లేందుకు ప్రయత్నించిన వ్యక్తిని అదుపులోకి కస్టమ్స్‌ తీసుకున్నారు. అతని నుంచి 25వేల సౌదీ అరేబియా రియాల్స్‌, 22,500 యూఏఈ దిర్హామ్‌ స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. మొత్తం కరెన్సీ విలువ భారత కరెన్సీలో రూ.8లక్షలకుపైగా ఉంటదని, సదరు వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు వివరించారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/