ఫుట్‌వేర్‌ డిజైనింగ్‌

ఉపాధి కోర్సులు

Footwear Designing

పాదరక్షల తయారీలో నాణ్యమైన మానవ వనరులను సృష్టించి ఎక్కువమందికి ఉపాధి కల్పించే లక్ష్యంతో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ఫుట్‌వేర్‌ డిజైన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఎఫ్‌డిడిఐ) 1986లో ఏర్పాటైంది.

ఈ సంస్థకు దేశవ్యాప్తంగా 12 కేంద్రాలు (హైదరాబాద్‌, నోయిడ్‌, రోహ్‌తక్‌, కోల్‌కతా, పుర్సత్‌గంజ్‌, చెన్నై, జోధ్‌పూర్‌, చిండ్వారా, పట్నా, చండీగఢ్‌, గుణ, అంక్లేశ్వర్‌) ఉన్నాయి.

వీటిలో పాదరక్షలు, లెదర్‌ ఉత్పత్తుల తయారీ, వాటి విక్రయాలకు సంబంధించి బ్యాచిలర్‌, మాస్టర్‌ డిగ్రీలను అందిస్తున్నారు.

యూజీ, పిజీల్లో కలిపి అన్ని సంస్థల్లోనూ 2,970 సీట్లు ఉన్నాయి. వీటితోపాటు మరో 288 ఎన్‌ఆర్‌ఐ, ఇండస్ట్రీ స్పాన్సర్డ్‌ సీట్లు లభిస్తున్నాయి.

ఈ సంస్థల్లో ప్రవేశానికి జాతీయస్థాయిలో నిర్వహించే ఆల్‌ ఇండియా స్కిల్‌ టెస్టు (ఎఐఎస్‌టి) రాయాలి. యూజీ, పిజీ కోర్సులకు ప్రత్యేకంగా పరీక్షలుంటాయి.

వీటిని ఆఫ్‌లైన్‌లోనే నిర్వహిస్తారు. ఎంబిఎ కోర్సులో ప్రవేశానికి మ్యాట్‌ స్కోరుతోనూ దరఖాస్తు చేసుకోవచ్చు.

అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులు:

బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌లో ఫుట్‌వేర్‌ డిజైన్‌ అండ్‌ ప్రొడక్షన్‌-905, లెదర్‌ గూడ్స్‌ అండ్‌ యాక్సెసరీస్‌ డిజైన్‌-385, ఫ్యాషన్‌-930 సీట్లు, బిబిఎ రిటైల అండ్‌ ఫ్యాషన్‌ మర్చెండైజ్‌-300 సీట్లు ఉన్నాయి.

అర్హత: ఇంటర్‌ ఉత్తీర్ణులు, ఆఖరు సంవత్సరం చదువుతున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.

అర్హత: ఇంటర్‌ ఉత్తీర్ణులు, ఆఖరు సంవత్సరం చదువుతున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
పీజీ: మాస్టర్‌ ఆఫ్‌ డిజైన్‌-పుట్‌వేర్‌ డిజైన్‌ అండ్‌ ప్రొడక్షన్‌ 150 సీట్లు.

అర్హత: ఫుట్‌వేర్‌/ లెదర్‌ గూడ్స్‌ అండ్‌ యాక్సెసరీస్‌/ డిజైన్‌/ ఫ్యాషన్‌/ ఫైన్‌ఆర్ట్స్‌/ ఆర్కిటెక్చర్‌/ ఇంజినీరింగ్‌/ ప్రొడక్షన్‌/ టెక్నాలజీల్లో బ్యాచిలర్‌ డిగ్రీ కోర్సులు పూర్తిచేసుకున్నవారు, ప్రస్తుతం ఆఖరి సంవత్సరం చదువుతున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆలిండియా స్కిల్‌ టెస్టు ద్వారా యూజి, పిజీల్లోకి అడ్మిషన్లు

ముఖ్యమైన తేదీలు: ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేదీ: ఏప్రిల్‌ 15
పరీక్ష తేదీ: మే 24
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌, విశాఖపట్నం.

కోర్సులు: కోర్సులో భాగంగా వివిధ పదార్థాలు, ఉత్పత్తులు ఉపయోగించి పాదరక్షలు, లెదర్‌ యాక్సెసరీలు ఎలా తయారు చేయాలో నేర్పిస్తారు.

యంత్రాల సాయంతో వాటిని డిజైన్‌ చేయిస్తారు. వినియోగదారుల అవసరాలపై అవగాహన కల్పించి అందుకు అనుగుణంగా ఉత్పత్తులు సృష్టించడంపై దృష్టిసారిస్తారు.

వీటితోపాటు రిటైల్‌ మేనేజ్‌మెంట్‌, కన్స్యూమర్‌ బిహేవియర్‌, రిటైల్‌ కమ్యూనికేషన్‌, కస్టమర్‌ రిలేషన్‌షిప్‌ మేనేజ్‌మెంట్‌, రిటైల్‌ ఆపరేషన్‌, మార్కెటింగ్‌, బ్రాండ్‌ మేనేజ్‌మెంట్‌, సేల్స్‌ మేనేజ్‌మెంట్‌, బేసిక్‌ కంప్యూటర్‌ నాలెడ్జ్‌..తదితర అంశాల్లో అవగాహన కల్పిస్తారు.

ఉపాధి అవకాశాలు:

ఈ సంస్థలో డిజైన్‌ కోర్సులు పూర్తిచేసిన వారికి ఎక్కువగా పాదరక్షలు, దుస్తులు, లెదర్‌ ఉత్పత్తులు తయారు చేసే సంస్థల్లో అవకాశాలు లభిస్తాయి.

బిబిఎ, ఎంబిఎ కోర్సు చదివినవారికి ఏరియా మేనేజర్‌, ఫ్లోర్‌ మేనేజర్‌, స్టోర్‌ మేనేజర్‌, మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ మొదలైన హోదాలతో పాదరక్షలు, లెదర్‌ యాక్సెసరీస్‌ విక్రయించే సంస్థలు, రిటైల్‌ చేయిన్లలో ఉద్యోగాలు ఉంటాయి.

వీరికి ఎక్కువ అవకాశాలు కార్పొరేట్‌ రిటైల్‌ దుకాణాల్లో లభిస్తాయి.

పుట్‌వేర్‌ డిజైన్‌ కోర్సులు పూర్తిచేసుకున్న వారికి పాదరక్షల తయారీ విభాగంలోని ఉద్యోగాలతోపాటు పాదరక్షలు విక్రయించే కొలువులూ దక్కుతాయి.

అడిడాస్‌, యాక్షన్‌, బాటా, వ్యూమా, ప్యూచర్‌ గ్రూప్‌, గ్లోబస్‌, ఖాదిమ్స్‌, లైఫ్‌స్టైల్‌, ల్యాండ్‌మార్క్‌, మ్యాక్స్‌, రీబక్‌, లిబర్టీ, రిలయన్స్‌ రిటైల్‌, వెస్ట్‌సైడ్‌, ఉడ్‌ల్యాండ్‌, వీకెసి, షాపర్స్‌స్టాప్‌, ప్యాంటలూన్స్‌.. మొదలైన సంస్థలు క్యాంపస్‌ నియామకాల ద్వారా ఎఫ్‌డిడిఐ విద్యార్థులకు అవకాశాలు కల్పిస్తున్నాయి.

ఫ్యాషన్‌ డిజైన్‌ కోర్సులు చదివినవారు కాస్ట్యూమ్‌ డిజైనర్‌, ఫ్యాషన్‌ కన్సల్టెంట్‌, పన్సనల్‌ స్లైటిస్ట్‌, ఫ్యాషన్‌ మర్చండైజర్‌, ఫ్రీలాన్స్‌ డిజైనర్‌ తదితర హోదాలతో రాణించవచ్చు.

కార్పొరేట్‌ దుస్తుల తయారీ కంపెనీల్లో అవకాశాలు లభిస్తాయి.

పరీక్ష విధానం:

అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సుల ప్రవేశపరీక్షలో 200 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. మొత్తం 150 ప్రశ్నలు. క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌లో 25 ప్రశ్నలను 50 మార్కులకు, వెర్బల్‌ ఎబిలిటీలో కాంప్రహెన్షన్‌ విభాగం నుంచి 10 ప్రశ్నలు 20 మార్కులకు వస్తాయి.

ఇదే విభాగంలో గ్రామర్‌ యూసేజ్‌ తదితరాల నుంచి వచ్చే 30 ప్రశ్నలకు 30 మార్కులు కేటాయించారు.
జనరల్‌ అవేర్‌నెస్‌లో 50 మార్కులకు 50 ప్రశ్నలు, బిజినెస్‌ విభాగంలో 15 ప్రశ్నలకు 30 మార్కులు ఉంటాయి.
ఆప్టిట్యూడ్‌ టెస్టులో 20 ప్రశ్నలను 20 మార్కులకు ఇస్తారు.
పిజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే పరీక్షలో 175 ప్రశ్నలు వస్తాయి. వీటికి 200 మార్కులు కేటాయించారు.

క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌లో 25 ప్రశ్నలు 50 మార్కులకు, ఇంగ్లిష్‌ కాంప్రహెన్షన్‌ అండ్‌ ఎనలిటికల్‌ ఎబిలిటీ 50 మార్కులకు 50 ప్రశ్నలు, జనరల్‌ నాలెడ్జ్‌ అండ్‌ కరెంట్‌ అఫైర్స్‌ 50 ప్రశ్నలు 50 మార్కులు, మేనేజ్‌మెంట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్టు 50 ప్రశ్నలు 50 మార్కులకు ఉంటాయి.

తాజా క్రీడా వార్తల కోసం https://www.vaartha.com/news/sports/: