దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త దశ, దిశ ఏర్పడింది: నిర్మలాసీతారామన్‌

FM Nirmala Sitharaman presents Interim Budget 2024

న్యూఢిల్లీః కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ ఆరోసారి బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ ప్రసంగిస్తున్నారు. మోడీ నాయకత్వంలోని ప్రభుత్వం నాలుగు కులాలకు ప్రాధాన్యమిచ్చిందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. పేదలు, మహిళలు, యువత, అన్నదాతలను శక్తిమంతం చేసే ప్రయత్నం చేసిందని తెలిపారు. పేదరిక నిర్మూలనకు బహుముఖి అయిన విధానాలతో ఈ ప్రభుత్వం పని చేసిందని వెల్లడించారు. రూ.34 లక్షల కోట్లు ప్రత్యక్ష నగదు బదిలీ పథకంతో పేదలకు జన్‌ధన్‌ ఖాతాల ద్వారా అందించిందని వివరించారు.

నూతన సంస్కరణలతో కొత్త పారిశ్రామిక వేత్తలు పుట్టుకొచ్చారు.
సంస్కరణపథంలో ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతోంది.
ఆత్మనిర్భర భారత్‌ నిర్మాణంలో ప్రతి వ్యక్తి భాగస్వాములయ్యారు.
దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త దశ, దిశ ఏర్పడింది.
మహిళలకు మూడింట ఒకవంతు రిజర్వేషన్లు కల్పించాం.
ప్రజల ఆదాయం 50 శాతం పెరిగింది.
అన్ని రంగాల్లో ఆర్థిక వృద్ధిని సాధిస్తున్నాం.

80 కోట్ల మందికి ఫ్రీ రేషన్‌తో ఆహార సమస్య తీరింది.
గరీబ్‌, మహిళ, యువ, అన్నదాతల ఆశలు, ఆకాంక్షలు, సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చాం.
గ్రామీణ ప్రజల ఆర్థిక వికాసం సాధ్యం అవుతోంది.
గతంలో సామాజిక న్యాయం అనేది రాజకీయ నినాదంగా ఉండేది.
మా ప్రభుత్వంలో సామాజిక న్యాయం అనేది మా పనితీరుగా మారింది.
వనరులను సమర్థంగా పంచి బంధుప్రీతిని, అవినీతిని రూపుమాపాం

పేదరిక నిర్మూలనకు బహుముఖీయ విధానాలతో ప్రభుత్వం పనిచేసింది.
పేదలకు జన్‌ధన్‌ ఖాతాల ద్వారా రూ.3.4 లక్షల కోట్లు అందించాం.
78 లక్షల మంది వీధి వ్యాపారులకు ఆర్థిక సాయం అందించాం.
రూ.2.20 లక్షల కోట్ల పూచీకత్తులేని రుణాలు అందించాం.
11.8 కోట్ల మంది రైతులకు పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి ద్వారా ఆర్థిక సాయం అందించాం.
4.50 కోట్ల మందికి బీమా సౌకర్యం కల్పించాం.
వ్యవసాయ రంగంలో కొత్త సాంకేతికతతో విలువ జోడించే విధానాలు తెచ్చాం.
స్కిల్‌ ఇండియా మిషన్‌తో కోటి 40 లక్షల మంది యువతకు నైపుణ్య శిక్షణ అందించాం.
యువతకు ముద్రా యోజనతో రూ.25 లక్షల కోట్లు రుణాలుగా ఇచ్చాం.
కొత్తగా 3000 ఐటీఐలు, 7 ఐఐటీలు, 16 ఐఐఐటీలు, 7 ఐఐఎంలు ప్రారంభించాం.