తెలుగు నటిపై ఫిట్‌నెస్ ట్రైనర్ అత్యాచారం

ముంబైలో ఓ తెలుగు నటిపై ఫిట్‌నెస్ ట్రైనర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. నగరంలో కూఫీ పరేడ్ పోలీసుస్టేషన్ పరిధిలో ఫిట్‌నెస్ ట్రైనర్ అయిన ఆదిత్యకపూర్ తెలుగునటిపై అత్యాచారం చేశాడు. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. ఫిట్‌నెస్ ట్రైనర్ ఆదిత్యకపూర్ పలుసార్లు అత్యాచారం చేశాడని, అనంతరం పెళ్లి చేసుకునేందుకు నిరాకరించాడని సదరునటి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

తనను వివాహం చేసుకోవాలని అడిగితే ఆదిత్య కపూర్ తనను దూషించి కొట్టాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. తన అశ్లీల చిత్రాలు నిందితుడి వద్ద ఉన్నాయని వాటిని బహిర్గతం చేస్తానని బెదిరిస్తున్నాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఆమె ఫిర్యాదుపై ఆదిత్య కపూర్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా, 2016 నుంచి తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న బాధితురాలు పలు చిత్రాల్లో నటించింది.