భారత గగనతలంలోకి ప్రవేశించిన రాఫెల్
మరికాసేపట్లో హర్యానాలోని అంబాలా చేరుకోనున్న రాఫెల్ యుద్ధ విమానాలు

న్యూఢిల్లీ: ఫ్రాన్స్ నుంచి బయలుదేరిన ఐదు రాఫెల్ యుద్ధ విమానాలు మరికాసేపట్లో హర్యానాలోని అంబాలా వాయుసేన బేస్‌లో దిగనున్నాయి. దాదాపు 7 వేల కిలోమీటర్లు ప్రయాణించి భారత్ చేరుకున్నాయి. ఇందులో రెండు శిక్షణ విమానాలు, మూడు యుద్ధ విమానాలు ఉన్నాయి. మార్గమధ్యలో యూఏఈలో అల్‌దఫ్రా ఎయిర్‌బేస్‌లో ఇంధనం నింపుకున్నాయి. చైనాతో సరిహద్దుల్లో ఉద్రిక్తతల దృష్ట్యా ఈ విమానాలను లఢఖ్ సెక్టార్లో మోహరించనున్నారు. కాగా అంబాలా వైమానిక స్థావరం వద్ద భారత వైమానిక దళాధిపతి ఎయిర్‌చీఫ్ మార్షల్ ఆర్.కె.ఎస్.భదూరియా కొత్త విమానాలను స్వీకరించనున్నారు. గత రెండు దశాబ్దాల కాలంలో భారత వైమానిక దళం అందుకుంటున్న తొలి కీలక అస్త్రం రాఫెల్ యుద్ధ విమానమే కావడం విశేషం. కాగా భారత గగనతలంలోకి ప్రవేశించిన రాఫెల్ విమానాలకు రక్షణగా రెండు సుఖోయ్(SU30 MKI) జెట్స్ తోడుగా ఉన్నాయి. ముంబై మీదుగా అంబాలా ఎయిర్‌బేస్‌కు వస్తున్నాయి. శుత్రు శిబిరాలను క్షణాల్లో ధ్వంసం చేసే సామర్థ్యం వీటి సొంతం. ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసిన 36 రాఫెల్ యుద్ధవిమానాల్లో ప్రస్తుతం ఐదు యుద్ధవిమానాలు అంబాలా చేరుకోనున్నాయి.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/business/