ఇంట్లోనే బక్రీద్‌ ప్రార్దనలు చేసుకోవాలి

Home minister Mahmood Ali resumes duty after recovering from

హైదరాబాద్‌: బక్రీద్‌ పండగను పరస్కరించుకుని మంత్రి మహమూద్‌అలీ జీహెచ్‌ఎంసి అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మహమూద్‌అలీ మాట్లాడుతూ.. కరోనా వైరస్‌ వ్యాప్తిచెందుతున్న దృష్ట్యా ముస్లిం సోదరులు ప్రత్యేక శ్రద్ద వహించి పండగ జరుపుకోవాలని సూచించారు. ప్రార్దనలు ఇంట్లోనే చేయాలని, అక్కడ కూడా భౌతికదూరం పాటించాలని, మాస్క్‌లను ధరించాల అన్నారు. తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలన్నారు. పండగ సందర్భంగా బలి ఇచ్చే జంతువుల వ్యర్ధాలను ఎప్పటికప్పుడు తొలగించేందుకు జీహెచ్‌ఎంసి అధికారులు ఏర్పాట్లుచేశారని తెలిపారు. ఇందుకోసం ప్రత్యేక వాహనాలను అదనపు సిబ్బందిని నియమించామని జీహెచ్‌ఎంసి అధికారులు హోంమంత్రికి వివరించారు. వర్షాలు అధికంగా కురుస్తున్న ప్రస్తుత తరుణంలో వ్యర్థాలను తొలగించే ప్రక్రియలో జీహెచ్‌ఎంసి సిబ్బందికి ముస్లిం సోదరులు సహకరించాలని అధికారులు అన్నారు. ఈసమావేశంలో కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌, జోనల్‌ అధికారులైన రవికిరణ్‌, మమత, శ్రీనివాస్‌రెడ్డి, ఉపేందర్‌రెడ్డి తదతరులు పాల్గొన్నారు. కాగా ఆగస్టు 1వ తేదీ నుంచి మూడు రోజుల పాటు బక్రీద్‌ పండగ జరుగనుంది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/