నేడు హైదరాబాద్ రానున్న సీఎం కేసీఆర్

న్యూఢిల్లీ : ఢిల్లీ లో సీఎం కేసీఆర్‌ వారం రోజుల పర్యటన ముగిసింది. దాదాపు 8 రోజులుగా ఢిల్లీలో బిజీబిజీ గా ఉన్నారు సీఎం కేసీఆర్‌. ఇవాళ మధ్యాహ్నం తర్వాత హైదరాబాద్ బయల్దేరనున్నారు. సెప్టెంబర్ 1 వ తేదీ నుంచి ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసిఆర్…. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో సమావేశమై రాష్ట్ర సమస్యలు, అవసరాలు, కేంద్రం నుంచి ఆశిస్తున్న సహాయం పై విస్తృతంగా చర్చలు జరిపారు.

ఇద్దరు కేంద్ర మంత్రులతో కీలక సమావేశాలలో పాల్గొన్న సీఎం కేంద్ర రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ, కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ లతో, రాష్ట్ర ఉన్నతాధికారులతో కలిసి సుదీర్ఘ సమావేశాలు నిర్వహించారు. రాష్ట్రంలో రహదారుల అభివృద్ది, జలవివాదాల పై ఇద్దరు కేంద్ర మంత్రులతో సీఎం కేసిఆర్ జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ఇక ఇవాళ ఢిల్లీ నుంచి హైదరాబాద్‌ రానున్నారు సీఎం కేసీఆర్.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/andhra-pradesh/