మెగా సపోర్ట్ పనిచేయలేదా..?

మా ఎన్నికల ఫలితాలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు లెక్కింపు చూస్తే మంచు ప్యానల్ సభ్యులు ముందంజ లో ఉన్నారు. శివబాలాజీ , రఘుబాబు , బాబు మోహన్ తో పాటు పలువురు విజయం వైపు పరుగులు తీస్తున్నారు. ఈ ఫలితాలు చూసి చాలామంది మా ఎన్నికల ఫై మెగా ఫ్యామిలీ సపోర్ట్ అనేది పనిచేయలేదని చెపుతున్నారు. ముందు నుండి కూడా ప్రకాష్ రాజ్ ప్యానల్ కు మెగా సపోర్ట్ అని ప్రచారం జరుగుతూ వచ్చింది. నాగబాబు సైతం డైరెక్ట్ గా ప్రకాష్ రాజ్ కే మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు.

అలాగే ప్రకాష్ రాజ్ ప్యానల్ లోని సభ్యులు అంత పాపులర్ వారే ఉండడం తో ఈ ప్యానల్ సభ్యులే విజయం సాధిస్తారని అంత అనుకున్నారు. కానీ ఫలితాలు చూస్తే మంచు ప్యానల్ కే అంత మద్దతు ఇచ్చినట్లు ఫలితాలు చూస్తే అర్ధమవుతుంది. అదికాక మంచు విష్ణు సైతం ప్రచారాన్ని బాగా చేయడం.. ఇతర చోట ఉన్న వారికీ సైతం ఫోన్లు చేసి ఓట్లు అడగడం..వారిని పోలింగ్ బూత్ కు రప్పించడం సక్సెస్ అయ్యారు. ఇది కూడా మంచు విష్ణు కు కలిసొచ్చినట్లు చెపుతున్నారు. మరి ఫైనల్ గా విజేతలు ఎవరో అనేది తెలియనుంది.