అమృత్‌‌సర్‌‌ గురునానక్ దేవ్ హాస్పిటల్‌‌లో భారీ అగ్నిప్రమాదం

రీసెంట్ గా ఢిల్లీలో జరిగిన భారీ అగ్నిప్రమాద ఘటన ఇంకా మరచిపోకముందే.. పంజాబ్ రాష్ట్రంలోని అమృత్ సర్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గురునానక్‌ దేవ్‌ ఆస్పత్రిలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ట్రాన్స్‌ఫార్మర్‌లో మంటలు చెలరేగి ఆస్పత్రికి వ్యాపించడం వల్ల ఈ ప్రమాదం జరిగింది.

8 ఫైరింజన్లతో రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను వెంటనే అదపు చేసింది. అయితే అగ్ని కీలక ధాటికి ఆస్పత్రి ఆవరణలోని పార్కింగ్‌లో ఉన్న వాహనాలు దగ్ధం అయ్యాయి. ఇక ఈ ప్రమాదం తో హాస్పటల్ అంత రోగుల ఆర్తనాదాలతో మారుమ్రోగింది. ఆసుపత్రిలో భయానక వాతావరణం నెలకొంది. అందులో ఉన్న పేషెంట్లను తరలించేందుకు సిబ్బంది ప్రయత్నాలు చేశారు. కానీ ఆసుపత్రి మొత్తం భారీగా పొగ కమ్ముకోవడంతో వారి ప్రయత్నాలకు ఆటంకాలు ఎదురయ్యాయి.