చిక్కుల్లో మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ మోహ‌న్ లాల్ ..

మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ మోహ‌న్ లాల్ చిక్కుల్లో పడ్డారు. కేర‌ళ‌కు చెందిన వ్యాపారి మాన్స‌న్ మాన్క‌ల్‌తో క‌లిసి మోహ‌న్ లాల్ మ‌నీ ల్యాండ‌రింగ్‌కు పాల్ప‌డిన‌ట్టు ఆరోప‌ణ‌లున్నాయి. ఈ కేసులో మాన్స‌న్‌ను గ‌తేడాది సెప్టెంబ‌ర్‌లోనే కేర‌ళ పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా ఈ కేసుపై దృష్టి సారించిన ఈడీ… మాన్స‌న్‌తో క‌లిసి మోహ‌న్ లాల్ కూడా మ‌నీ ల్యాండ‌రింగ్‌కు పాల్ప‌డిన‌ట్టు భవిస్తూ..ఆయనకు నోటీసులు జారీ చేశారు. వ‌చ్చే వారం విచార‌ణ‌కు రావాలంటూ ఈడీ అధికారులు ఆయ‌న‌కు నోటీసులు జారీ చేశారు. విచార‌ణ కోసం కొచ్చిలోని ఈడీ కార్యాల‌యానికి రావాలంటూ ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.

ఇక మోహన్ లాల్ సినిమాల విషయానికి వస్తే..జీతూ జోసెఫ్ డైరెక్షన్లో 12Th మాన్ అనే సినిమా చేసాడు. ఈ సినిమా మొదలైన దగ్గర నుండే భారీ అంచనాలు నెలకోనగా మోహన్ లాల్ అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఎదురుచూస్తున్నారు. భారీ అంచనాలున్న ఈ సినిమాను థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేస్తున్నారు. ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్​ హాట్​స్టార్​ వేదికగా మే 20 నుంచి ప్రసారం కానుంది.