ఏపిలో మరో 61 కరోనా పాజిటివ్ కేసులు
కరోనా కేసుల మొత్తం సంఖ్య 1,016..మొత్తం మృతులు 31

అమరావతి: ఏపిలో కరోనా మహమ్మారి తన పంజా విసురుతుంది. గత 24 గంటల్లో 61 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఏపి వైద్య, ఆరోగయ శాఖ వెల్లడించింది. కర్నూలులో కొత్తగా 14, గుంటూరులో 3, అనంతపురంలో 5, తూర్పు గోదావరి జిల్లాలో 3, కృష్ణా జిల్లాలో 25 కేసులు నమోదయ్యాయని వివరించింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య మొత్తం 1,016కి చేరింది. కాగా ఏపిలో కరోనాతో 24 గంటల్లో ముగ్గురు మృతి చెందారు. ఏపిలో ఇప్పటివరకు 31 మంది కరోనాతో మృతిచెందారు. మరోవైపు కర్నూలులో అత్యధికంగా 275, గుంటూరులో 209 కరోనా కేసులు నమోదయ్యాయి.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/