ఆరోగ్య రంగానికి రూ.50 వేల కోట్లు

YouTube video
Press conference by Union Finance Minister Nirmala Sitharaman

న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసేందుకు కేంద్రం కొత్త చర్యలు ప్రకటించింది. కోవిడ్ రిలీఫ్ కోసం చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొంది. ఇందుకోసం ఆర్థిక ఉపశమన చర్యలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. సోమవారంనాడు మీడియాతో మంత్రి మాట్లాడుతూ.. ఆర్థిక నష్టాలనుంచి గట్టెక్కేలా పలు పరిశ్రమలకు ఆర్థిక సహాయ చర్యలకు సంబంధించి కేంద్ర మంత్రి కొన్ని ప్రకటనలు చేశారు. వైద్య రంగంలో మౌలిక వసతుల కల్పనకోసం భారీగా నిధులను ఆర్థిక మంత్రిత్వ శాఖ కేటాయించింది. అత్యవసర క్రెడిట్ లైన్ హామీ పథకం (ఇసిఎల్‌జిఎస్‌ పరిమితిని) రూ .4.5 లక్షల కోట్లకు పెంచింది. టైర్ 2 ,3నగరాల్లో ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాల కల్పనకు ఆర్థిక శాఖ ప్రాధాన్యతనిచ్చింది.

కేంద్రం తీసుకున్న కీలక నిర్ణయాలు..

•రూ.1.1 లక్ష కోట్ల రుణహామీ పథకం‌
•ఆరోగ్య రంగానికి రూ.50వేల కోట్లు
•ఆత్మనిర్భర్‌ ప్యాకేజీ కింద ఆర్థికసాయం
•వైద్య, మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి
•టైర్‌ 2,3 పట్టణాలపైనా ప్రత్యేక దృష్టి సారిస్తాం
•ఇతర రంగాలకు 60వేల కోట్ల లోన్‌ గ్యారంటీ
•అలాగే వడ్డీ రేటు 8.25 శాతం

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/