ఫ్రీ బస్సు పథకం : సీటు కోసం సిగపట్లు..

తెలంగాణ లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ..వచ్చిన రెండు రోజుల్లోనే మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించి వారిలో ఆనందం నింపారు. ఈ పథకం అమల్లోకి వచ్చిన దగ్గరి నుండి పెద్ద ఎత్తున మహిళలు బస్సు ప్రయాణాలు చేస్తూ..పధకాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు.

ఇదే క్రమంలో పలు ఉద్రక్తత ఘటనలు కూడా బస్సుల్లో చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా బస్సు లో సిట్ కోసం మహిళలు కొట్టుకోవడం ప్రతి రోజు ఎక్కడో ఓ చోట జరుగుతూనే ఉంది. తాజాగా సికింద్రాబాద్ నుంచి దుబ్బాకకి బస్సు వస్తుండగా సీటు కోసం మహిళల మధ్య గొడవ తలెత్తింది. ఒకరిపై ఒకరు చెప్పులతో దాడి చేసుకున్నారు. సీటు కోసమే ఈ గొడవ జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.