ఎనిమిది రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఐదో దశ పోలింగ్‌

fifth phase of polling is ongoing in eight states

న్యూఢిల్లీః 2024 పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఈరోజు ఉదయం ఏడు గంటల నుంచి ఐదో విడత ఎన్నికల పోలింగ్ ప్రారంభం అయింది. దేశవ్యాప్తంగా ఎనిమిది రాష్ట్రాల్లో 49 నియోజకవర్గాలకు ఈ పోలింగ్ జరుగుతుంది. కొన్ని ప్రాంతాల్లో భద్రతా దృష్ట్యా సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగనుండగా.. మరికొన్ని ప్రాంతాల్లో సాయంత్రం 5 గంటల వరకు ఈ పోలింగ్ జరగనుంది. ఈ ఐదో దశలో యూపీ లో 14, మహారాష్ట్రలో 13, బెంగాల్ లో 7 స్థానాలు, బీహార్‌లొ 5, ఒడిశాలో 5, జార్ఖండ్‌లో 3, జమ్ముకశ్మీర్, లడఖ్ లలో ఒక్కో స్థానం.. మొత్తం 49 పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ జరగనుండగా.. ఇందులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న రాయ్‌బరేలి నుంచి రాహుల్ గాంధీ పోటీలో ఉన్నారు. అలాగే లక్నో నుంచి రక్షణ మంత్రి రాజ్ నాథ్, అమేథీ నుంచి స్మృతి ఇరానీ, కైసర్ గంజ్ నుంచి బ్రిజ్‌భూషణ్ కుమారుడు కరణ్ పోటీలతో పాటు మొత్తం 659 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.