ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో ఫెదరర్‌ సెంచరీ

Roger Federer
Roger Federer

మెల్‌బోర్న్‌: టెన్నిస్‌ సీజన్‌ తొలి గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌ ఐదో రోజు సంచలనాల మోత మోగింది. పురుషుల సింగిల్స్‌లో ఆస్ట్రేలియా ఓపెన్ చరిత్రలో 100 విజయంతో రోజర్ ఫెదరర్‌.. అలవోకగా ముందంజ వేశారు. తొలి రెండు రౌండ్లలో పోటీయే ఎదురుకాని మూడో సీడ్‌ ఫెడరర్‌కు మూడో రౌండ్‌లో చెమటోడ్చాడు. స్థానిక ప్లేయర్‌ జాన్‌ మిల్‌మన్‌పై 4-6, 7-6 (7/2), 6-4, 4-6, 7-6 (10/8)తో అతికష్టంపై నెగ్గాడు. ఫెడెక్స్‌కిది ఇక్కడ 100వ గెలుపు కావడం విశేషం. డిఫెండింగ్‌ చాంపియన్‌ నొవాక్‌ జొకోవిచ్‌ 6-3, 6-2, 6-2తో నిషియోకా (జపాన్‌)పై గెలిచాడు. నిరుడు ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ క్వార్టర్స్‌లో ఫెదరర్‌పై గెలిచిన గ్రీక్‌ ఆటగాడు స్టెఫానో సిట్సిపాస్‌ ఈసారి మూడోరౌండ్‌ను దాటలేదు. రౌనిక్‌ (కెనడా)7-5, 6-4, 7-6 (7/2)తో ఆరోసీడ్‌ సిట్సిపా్‌సను ఇంటికి పంపాడు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/