కొవ్వును కరిగించే మామిడి కాయ

ఫలాలు..ఆరోగ్యం

Fat-dissolving mango
Fat-dissolving mango

100 గ్రాముల మామిడి కాయలో పిండి పదార్ధాలు 15 గ్రా . కొవ్వు 04 గ్రా , పీచు 1. గ్రా. , ;ప్రోటీన్లు 0.8 గ్రా. ఉంటాయి.. లభించే క్యాలరీలు 60. విటమిన్ సి, యాన్తి ఆక్సీడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. వీటిని రోజూ తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.. సాధారణంగా ఈ కాయలు చలవ చేస్తాయి.. శరీరం డీ హైడ్రేట్ కాకుండా చూస్తాయి.

మామిడి పండుతో పోలిస్తే కళ్యాణ్ నుంచి వచ్చే క్యాలరీలు చాల చాల తక్కువ. చక్కెరలు కూడా… ఇది జీవ క్రియలను వేగవంతం చేసి కొవ్వును కరిగిస్తుంది… బరువు తగ్గాలనుకునే వారు ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాలి.

జీర్ణానికి ఆరోగ్యానికి మేలు చేస్తుంది… మలబద్దకం అజీర్తితో బాధపడేవారు దీన్ని తీసుకుంటే ఈ సమస్యలకు చెక్ పెట్టొచ్చు. కొందరు గర్భిణీల్లో వాంతులు , వికారం చూస్తుంటాం.. ఇలాంటి ఇబ్బంది ఉన్నవారు మామిడి ముక్కలను తింటే ఫలితం ఉంటుంది.

మామిడి కాయలో విటమిన్ ఏ , సి లతో మెగ్నీషియం ఎక్కువే. ఇది శరీరంలోని పదార్ధాలను తొలగించి చర్మం, జుట్టును మెరిపిస్తుంది. పచ్చికాయలు శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తాయి. ఈ కాయలో విటమిన్ బి 3 పుష్కలంగా ఉంటుంది.. నియాసిన్ గా పిలిచే ఈ పోషకం గుండె జబ్బుల నుంచి దూరం చేస్తుంది . కచ్చా ఆమ్లో క్యాల్షియం కూడా ఎక్కువే. ఇది దంతాలకు కావాల్సిన శక్తిని ఇస్తుంది… మామిడికాయ ముక్కలను తరచూ తింటుంటే చిగుళ్ల నుంచి రక్తం కారటం తగ్గి దంతాలు ఆరోగ్యంగా మారతాయి.

ఆంధ్ర ప్రదేశ్ వార్తల కోసం :https://www.vaartha.com/andhra-pradesh/