ఉమ్మడి ప్రతిపక్షా పార్టీలకు షాక్ ఇచ్చిన ఫరూక్ అబ్దుల్లా

త్వరలో జరగబోయే రాష్ట్రపతి ఎన్నికల్లో ఎలాగైనా బిజెపి షాక్ ఇవ్వాలని ఉమ్మడి ప్రతిపక్షాలు భావించాయి. కానీ బిజెపి కి షాక్ ఏమోకానీ ఇప్పుడు ఉమ్మడి ప్రతిపక్షాలకె వరుస షాకులు తగులుతున్నాయి. ఉమ్మడి ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా ముందుగా శరత్ పవర్ ను అనుకుంటే ఆయన నో చెప్పాడు. ఆ తర్వాత నేషనల్ కాన్ఫరెన్స్ ప్రెసిడెంట్, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లాను అనుకున్నారు. కానీ ఇప్పుడు ఈయన కూడా నో చెప్పాడు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో కాశ్మీర్ కు తన అవసరం ఉందని ఆయన అన్నారు. అబ్దుల్లా మాట్లాడుతూ భారత రాష్ట్రపతి పదవికి ఉమ్మడి ప్రతిపక్ష అభ్యర్థిగా మమతా బెనర్జీ నా పేరు ప్రతిపాదించడం గౌరవంగా భావిస్తున్నానని, మమతా దీది నా పేరును ప్రతిపాదించిన తర్వాత నా అభ్యర్థిత్వానికి మద్దతు ఇస్తానని ప్రతిపక్ష నాయకులు ఫోన్లు చేశారని ఆయన వెల్లడించారు.

ప్రస్తుతం అనిశ్చిత పరిస్థితుల్లో ఉన్న జమ్మూ కాశ్మీర్ కు తన అవసరం ఉందని, తాను క్రియాశీల రాజకీయాల్లో కొనసాగుతానని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా అబ్దుల్లా తనకు సపోర్ట్ చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలోకి దిగడానికి అబ్దుల్లా నిరాకరించడంతో ప్రతిపక్షాలకు ఎదురుదెబ్బ తగిలింది. మరి ఇప్పుడు ఇంకా ఎవర్ని ఎంపిక చేస్తారో అని అంత మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. రీసెంట్ గా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నాయకత్వంలో ఇటీవల విపక్షాలు భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలోనే ఉమ్మడి ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా ఫరూఖ్ అబ్దుల్లా, గోపాలకృష్ణ గాంధీల పేర్లను ప్రతిపాదించారు. ఇప్పుడు ఫరూఖ్ నో చెప్పాడు కాబట్టి గోపాలకృష్ణ బరిలోకి దించుతారేమో..