అఖిల్ ఏజెంట్ విషయంలో ఫ్యాన్స్ అసంతృప్తి

Akhil Akkineni stilll From `Agent` Movie
Fans are unhappy about Akhil’s agent

Community-verified icon


అక్కినేని అఖిల్ నటించిన ఏజెంట్ మూవీ కోసం అక్కినేని ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. చిత్రసీమలోకి హీరోగా అడుగుపెట్టి చాలాకాలం అవుతున్న ఇంతవరకు అఖిల్ కమర్షియల్ హిట్ కొట్టలేకపోయారు. అఖిల్ నటించిన గత చిత్రం మోస్ట్ బ్యాచ్లర్ సైతం యావరేజ్ తోనే సరిపెట్టుకుంది. దీంతో ఏజెంట్ మూవీ ఫై అందర్నీలో ఆశలు పెరిగాయి. కానీ ఈ మూవీ షూటింగ్ మొదలుపెట్టడం , రీషూట్ జరుపుకోవడం వంటివి జరిగిపోయాయి. కానీ సినిమా తాలూకా ప్రమోషన్ మాత్రం ఇంకా మొదలుకాలేదు.

ఇప్పటికే పలు రిలీజ్ డేట్స్ వాయిదాపడ్డాయి. ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం అని మేకర్స్ చెపుతున్నప్పటికీ అభిమానుల్లో మాత్రం సందేహంగానే ఉంది. ఎందుకంటే ఇంతవరకు సినిమా నుండి ఒక్క సాంగ్ రిలీజ్ చేయలేదు. ఎక్కడ కూడా ప్రమోషన్ కార్య క్రమాలు మొదలుపెట్టలేదు. అఖిల్ సైతం సైలెంట్ గా ఉంటున్నాడు. దీంతో అభిమానుల్లో అసంతృప్తి ఎక్కువై పోతుంది. ఏజెంట్ సినిమా నుండి పోస్టర్స్ విడుదల అయ్యాయి.. టీజర్ వచ్చింది కానీ ఇప్పటి వరకు ఒక్క పాటను కూడా విడుదల చేయలేదు. ఈ మధ్య కాలంలో సినిమా విడుదలకు చాలా వారాల ముందు పాటలను విడుదల చేస్తున్నారు. పాటల యొక్క స్పందన బట్టి సినిమా స్థాయి అమాంతం పెరుగుతుంది. కనుక ఏజెంట్ పాటలను కూడా విడుదల చేస్తే బాగుంటుంది అంటూ అక్కినేని ఫ్యాన్స్ విజ్ఞప్తి చేస్తున్నారు. మరి ఇప్పటికైనా మేకర్స్ కాస్త ప్రమోషన్ ఫై దృష్టి సారిస్తే బాగుంటుంది.