స్పెయిన్ లో పెళ్లి రోజు వేడుకలు జరుపుకోబోతున్న మహేష్ బాబు

ఫిబ్రవరి 10 సూపర్ స్టార్ మహేష్ బాబు – నమ్రతల పెళ్లి రోజు. ఈ పెళ్లి రోజు వేడుకలను వీరు స్పెయిన్ లో జరుపుకోబోతున్నారు.గత ఏడాది మహేష్ బాబు ఫ్యామిలీ లో వరుస విషాదాలు కోలుకోలేకుండా చేసిన సంగతి తెలిసిందే. అన్న, తల్లి , తండ్రి ని మహేష్ కోల్పోయాడు. ఈ విషాద ఏడాది నుండి ఇప్పుడిప్పుడే మహేష్ బయటకు వస్తున్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్లో తన 28 వ చిత్రం చేస్తున్నాడు. గత కొద్దీ రోజులుగా షూటింగ్ జరుపుకుంటూ వస్తుంది.

ఈ క్రమంలో షూటింగ్ కు కాస్త బ్రేక్ రావడం..ఇదే సమయంలో తన పెళ్లి రోజు కూడా రావడం తో మహేష్..తన ఫ్యామిలీ తో కలిసి స్పెయిన్ కు బయలుదేరారు. అక్కడే కొన్ని రోజుల పాటు ఎంజాయ్ చేసేందుకు అన్నీ ప్లాన్ చేసుకున్నట్లు సమాచారం. మరో మూడు నాలుగు రోజుల పాటు వాళ్లు అక్కడే ఉండే అవకాశం కనిపస్తోంది. అయితే మహేష్ బాబు తిరిగి వచ్చే వరకు ఎస్ఎస్ఎంబీ 28 సినిమాకు సంబంధించిన షూటింగ్ జరగట్లేదని తెలుస్తోంది. ఓ వారం రోజుల పాటు ఈ షూటింగ్ కు బ్రేక్ పడింది.

సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ఫై నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా పూజా హగ్దే హీరోయిన్ గా నటిస్తుంది. థమన్ మ్యూజిక్ అందిసున్నారు.