ముఖానికి వీటిని వాడకండి…

ముఖ చర్మ సంరక్షణ : మేకప్ టిప్స్

అందమంటే.. ముఖ్యంగా ముఖ సౌందర్యం పైనే శ్రద్ధ పెడుతుంటారు అమ్మాయిలు. ఈ క్రమంలో ఇటు ఇంటి చిట్కాలను, అటు బయట దొరికాయి వివిధ రకాల సౌందర్య ఉత్పత్తులను వాడుతుంటారు.. అయితే వీటిలో ముఖానికి వాడకూడని పదార్ధాలు కూడ కొన్ని ఉంటాయని అంటున్నారు నిపుణులు… ఈ విషయం తెలియక చాలా మంది తమ ముఖ సౌందర్యాన్ని చేజేతులా పాదకు చేసుకుంటున్నారు చెబుతున్నారు… మరి, ఇంతకీఈ అందాన్ని సంరక్షించుకునే క్రమంలో ముఖానికి వాడకూడని ఆ పదార్ధాలు ఏంటో తెలుసుకుందాం…

బాడీ లోషన్ :

చర్మానికి తేమను అందించటానికి బాడీ లోషన్ ఉపయోగించటం మనకు అలవాటే.. అయితే కొంతమంది దీన్నే ముఖానికి కూడా వాడుతుంటారు… ఫలితంగా ఇందులోనే జిడ్డు దనం ముఖ చర్మ రంధ్రాల్లోకి చేరి క్రమంగా మొటిమలు రావటానికి దారితీస్తుంది.. ఇక దీనిలో ఉండే కృత్రిమ పరిమళాలు మృదువుగా ఉండే ముఖ చర్మంపై అలర్జీలు రావటానికి కారణమవుతాయి.. కాబట్టి ముఖం కోసం ప్రత్యేకంగా తయారు చేసిన బ్యూటీ ఉత్పత్తులు.. అది కూడా పారాబెన్ వంటి లేనివి ఎంచుకోవటం ఉత్తమం అని నిపుణులు అంటున్నారు.. అందుకే వీటిని కొనే ముందు ఓసారి లేబుల్ పరిశీలించటం మర్చి పోవద్దు.

నిమ్మకు బదులు :

ముఖానికి ఉపయోగించే స్కర్బ్స్ ,పేస్ పాక్స్, వంటి వాటిలో నిమ్మను ఉపయోగించటం సహజమే.. కొంత మంది అయితే నిమ్మ చెక్కను నేరుగా ముఖంపై రుద్దుకుంటూ వుంటారు.. అయితే ఇందులోని కొన్ని సమ్మేళనాలు కొంతమందిలో ముఖ చర్మాన్ని మరింత సున్నితంగా మారుస్తాయి.. తద్వారా ఎండలోకి వెళ్ళినపుడు చర్మం ఇరిటేషన్ కు గురై దురద, మాన్తా,, వంటి సమాసాలు వస్తాయి.. కాబట్టియు దీనికి బదులుగా బంగాళా దుంప, టొమాటో .. వంటి ప్రత్యామ్నాయ మార్గాలైతే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

టూత్ పేస్ట్ వద్దు :

మొటిమలు ఉన్న చోట టూత్ పేస్ట్ రాయమని సలహా ఇస్తుంటారు చాలా మంది.. కానీ వద్దంటున్నారు నిపుణులు… ఎందుకంటే ఇవి అప్లై చేసిన చోట చర్మంలో మెలనిన్ ఉత్పత్తి పెరుగుతుంది…. తద్వారా కొంత మందిలో ఆ ప్రదేశంలో నల్ల మచ్చలు, రంగు మారటం, వంటి సమస్యలొచ్చే అవకాశం వుంటుందట… అలాగే ఇందులోని గాఢమైన పదార్ధాల వలన కొంతమందిలో ఇన్ఫెక్షన్స్ , అలర్జీలు కూడా రావచ్చట..

వ్యాక్స్ చేస్తున్నారా?

ముఖంపై అవాంఛిత రోమాల్ని తొలగించుకోవటానిక్ చాలామంది అనుసరించే పద్దతి వ్యాక్స్ చేసుకోవటం . ఇందుకు అనుగుణంగానే వ్యాక్స్ స్ట్రిప్స్ మార్కెట్లో లభిస్తున్నాయి… అయితే,, చర్మ తత్వాన్ని బట్టి వీటిని ఎంచుకోవాల్సి ఉంది . ఈ విషయాన్ని నిర్లక్ష్యం చేస్తే మాత్రం చర్మం ఎరుపెక్కటం , దద్దుర్లు రావటం, ముడతలు పడటంతో పాటు చర్మం మరింత సున్నితంగా మారుతుంది… తద్వారా ఎండలోకి వెళ్ళినపుడు కందిపోవటం, ర్యాషెస్, వంటి సమస్యలు వస్తాయి.. కాబట్టి ఫేషియల్ వ్యాక్స్ ఎంచుకునే ముందు చర్మ తత్వాన్ని పరిగణలోకి తీసుకోవటం ఇంట్లో తయారు చేసుకున్న వ్యాక్స్ అయినా, బయటి నుంచి తెచ్చిన స్ట్రిప్ అయినా .. అప్లై చేసుకునే ముందు ఓసారి ప్యాచ్ టెస్ట్ చేసుకోవటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం : https://www.vaartha.com/category/andhra-pradesh/