కరోనా బారినపడిన మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి..

దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కూడా వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉంది. దీంతో మరోసారి కరోనా బారిన పెద్ద సంఖ్య లో సామాన్య ప్రజలే కాదు సినీ , రాజకీయ ప్రముఖులు పడుతున్నారు. తాజాగా తెలంగాణ విద్యుత్‌ శాఖ మంత్రి, టీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ లీడర్‌ జగదీశ్వర్‌ రెడ్డికి కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది.

దీంతో ఆయన హోం ఐసోలేషన్‌ లో చికిత్స పొందుతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి… తన సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఇటీవల కాలంలో… తనను కలిసిన పార్టీ నేతలు, సన్నిహితులు కరోనా పరీక్షలు చేయించుకోవాలని మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి కోరారు. ప్రతి ఒక్కరూ మాస్కులు, భౌతిక దూరం పాటించాల్సిన అవసరం ఉందన్నారు. సోమవారం ఒక్కరోజే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1,825 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం తెలంగాణలో దాదాపు 15 వేల యాక్టివ్ కేసులు ఉన్నాయి.