జాతిపితకు ప్రధాని మోడి ఘన నివాళి

మాజీ ప్రధాని లాల్‌బహుదూర్‌ శాస్త్రి కూడా ప్రధాని నివాళి

PM Shri Narendra Modi takes part in Sarva Dharma Prarthana at Gandhi Samadhi
PM Shri Narendra Modi pays tribute to Lal Bahadur Shastri at Vijay Ghat

న్యూఢిల్లీ: నేడు జాతిపిత మహాత్మాగాంధీ 151వ జయంతి ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోడి ఘనంగా నివాళులర్పించారు. యువత మహాత్ముడిని స్ఫూర్తిగా తీసుకొని ఆయన మార్గంలో నడవాలని అన్నారు. అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్య్రాన్ని సాధించి పెట్టిన మహోన్నత వ్యక్తి మహాత్మాగాంధీ అని కొనియాడారు.

మరోవైపు ఈరోజు మాజీ ప్రధాని లాల్‌బహుదూర్‌ శాస్త్రి జయంతి సైతం కావడంతో విజయ్‌ఘాట్‌ వద్ద ఆయనకు ప్రధాని నరేంద్రమోడితోపాటు లాల్‌బహుదూర్‌ శాస్త్రి కుమారుడు అనిల్‌ శాస్త్రి సైతం అంజలి ఘటించారు. పలువురు రాజకీయ ప్రముఖులు, నాయకులు సైతం మహాత్మా గాంధీకి, లాల్‌బహుదూర్‌ శాస్త్రికి నివాళులర్పించారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/