మాజీ ఎమ్మెల్యే మందాడి సత్యనారాయణ రెడ్డి మృతి

తెలంగాణ సీనియర్ రాజకీయ నేత, మాజీ ఎమ్మెల్యే మందాడి సత్యనారాయణ రెడ్డి ఆదివారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. తాజాగా హన్మకొండలోని తన ఇంట్లో తుదిశ్వాస విడిచారు. బీజేపీతో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన మందాడి సత్యనారాయణ రెడ్డి… ఆ పార్టీలో రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎదిగారు. తెలంగాణ ఉద్యమ సమయంలో బీజేపీని వీడిన ఆయన టీఆర్ఎస్ లో చేరారు. టీఆర్ఎస్ తరఫుననే ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు.

జనగామ జిల్లా స్టేషన్‌ ఘనపూర్ మండలం ఇప్పగూడ గ్రామంలో మందాడి సత్యనారాయణ రెడ్డి జన్మించారు. బీజేపీలో సాధారణ కార్యకర్తగా రాజకీయం ప్రస్థానం ప్రారంభించిన ఆయన.. అంచెలంచెలుగా ఎదిగి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆ పార్టీ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. తెలంగాణ ఉద్యమం సమయంలో బీజేపీని వీడి టీఆర్ఎస్‌లో చేరారు. 2004 ఎన్నికల్లో హన్మకొండ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. 2009 ఎన్నికలకు ముందు టీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
మందాడి సత్యనారాయణ మృతి పట్ల బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య తదితరులు సంతాపం ప్రకటించారు.