ప్రభాస్ పెళ్లిపై శ్యామలాదేవి ఏమన్నారంటే..!!

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా పేరున్న ప్రభాస్..తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక స్టోరీని షేర్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ప్రభాస్ పెళ్లి కోసం గత కొన్నేళ్లుగా అభిమానులు, టాలీవుడ్ సినీ ప్రముఖులు ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. చిన్న చిన్న హీరోలు పెళ్లి చేసుకొని సెటిల్ అవుతుంటే..44 ఏళ్లు ఉన్న ప్రభాస్ ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటాడా అని అంత మాట్లాడుకుంటున్నారు.

తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి ‘ప్రభాస్’ పెళ్లిపై అడిగిన ప్రశ్నకు సమాధానం తెలిపారు. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్‌కు విజయం దక్కదని చాలామంది అన్నారని, కానీ వారి అంచనాలు తారుమారయ్యాయని కల్కి సినిమాను ఉద్దేశించి పేర్కొన్నారు. ప్రభాస్ పెళ్లి విషయంలోనూ అదే జరుగుతుందన్నారు. పెళ్లి చేయాలని తమకూ ఉందని అయితే, అందుకు తగిన సమయం రావాలని అన్నారు. వస్తుందన్న నమ్మకంతోనే ఉన్నామని, పైనుంచి కృష్టంరాజు చూసుకుంటారని పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఆశించినవన్నీ జరిగాయని, పెళ్లి కూడా జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.