గంటా అనుచరుడు నలంద కిశోర్ మృతి

Nalanda Kishore

అమరావతి: ఏపి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అనుచరుడు నలంద కిశోర్‌ మృతిచెందారు. నలంద కిశోర్‌ను మూడు వారాల క్రితం కర్నూలు సీఐడీ పోలీసులు అర్ధరాత్రి సమయంలో అదుపులోకి తీసుకున్నారు. విశాఖపట్నం నుంచి నేరుగా కర్నూలుకు రోడ్డు మార్గంలో తరలించి అక్కడ న్యాయస్థానంలో హాజరుపర్చి, విచారించి ఆయనను తిరిగి వదిలేశారు. అప్పటి నుంచి ఆయన ఆరోగ్యం బాగోలేదని ఆయన బంధువులు అంటున్నారు. అనారోగ్యంతో ప్రైవేటు ఆసుపత్రిలో చేరిన ఆయన… చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం ప్రాణాలు కోల్పోయారని వారు తెలిపారు. కాగా ఐదు రోజులుగా జ్వరంతో బాధపడ్డారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం అందాల్సి ఉంది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/