బర్త్ డే సీఎంపీ రిలీజ్

సోషల్ మీడియాలో గ్రాండ్ గా సెలబ్రేట్

Mega Star Chiranjeevi
Mega Star Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి ఇవాళ తన 65వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ప్రతి ఏడాది చిరంజీవి బర్త్ డే నాడు ఆయన అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు చేస్తుంటారు.

ఈ ఏడాది కూడా సెలబ్రేషన్స్ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసారు మెగా అభిమానులు. ఈ నేపథ్యంలో #ChiruBdayFestBegins హ్యాష్ ట్యాగ్స్ తో ట్వీట్స్ పెడుతూ ఇప్పటికే సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు.

కాగా ఈ మధ్య ట్రెండ్ గా మారిన కామన్ డిస్ప్లే పిక్చర్ (డీపీ)ని మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా రూపొందించారు.

తాజాగా చిరు తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కామన్ డీపీని సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు.

‘ఖైదీ’ ‘స్వయంకృషి’ ‘పసివాడి ప్రాణం’ ‘ఘరానా మొగుడు’ ‘ఇంద్ర’ ‘ఖైదీ నెం.1’ చిత్రాల్లోని చిరంజీవి స్టిల్స్ తో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ శిఖరాన్ని చేరినట్లుగా ఈ సీడీపీ డిజైన్ చేయబడింది.

చిరంజీవి బర్త్ డే కానుకగా మెగా అభిమానులు కామన్ మోషన్ పోస్టర్ (సీఎంపీ)ని రూపొందించారు.

దీన్ని భారతీయ సినీ ఇండస్ట్రీలోని 100 మంది సెలబ్రిటీల సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కామన్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేయించారు.

#HBDMegastarChiranjeevi హ్యాష్ ట్యాగ్ తో 100 మంది సినీ ప్రముఖులు సీఎంపీని షేర్ చేస్తూ చిరంజీవికి బర్త్ డే విషెస్ తెలియజేసారు.

అయితే ఇప్పటి వరకు ఈ విధంగా ఏ హీరో బర్త్ డే ని సెలబ్రేట్ చేయలేదని చెప్పవచ్చు.

ఇక రాష్ట్ర రామ్ చరణ్ యువశక్తి అభిమాన సంఘం చిరు పుట్టినరోజు కానుకగా ఆయనకి విషెస్ తెలియజేస్తూ ‘మెగాస్టార్స్ మెగా ర్యాప్’ సాంగ్ రిలీజ్ చేసారు.

మొత్తం మీద ఈ ఏడాది కరోనా కారణంగా మెగా అభిమానులు చిరు పుట్టినరోజును సోషల్ మీడియాలో గ్రాండ్ గా సెలెబ్రేట్ చేస్తున్నారు.

తాజా ఎన్నారై వార్తల కోసం : https://www.vaartha.com/news/nri/