అందరికీ సమానావకాశాలు

అలిగఢ్ ముస్లిం వర్సిటీ శత వార్షికోత్సవ మహోత్సవం లో వర్చూల్ పద్ధతిలో గెస్ట్ గా హాజరైన ప్రధాని మోడీ

PM Modi
PM Modi

New Delhi: దేశంలో మతం ఆధారంగా ఎలాంటి వివక్షా లేదని ప్రధాని నరేంద్ర మోడీ ఉద్ఘాటించారు. దేశంలో అందరికీ సమానావకాశాలు ఉన్నాయనీ, ప్రజలందరికీ అభివృద్ధి ఫలాలు అందుతున్నాయనీ ప్రధాని మోడీ చెప్పారు.

అలిగఢ్ ముస్లిం వర్సిటీ శత వార్షికోత్సవ మహోత్సవానికి ఆయన వర్చువల్ పద్ధతిలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కులం, మతం, వర్గం అన్న తేడా లేకుండా అందరికీ రాజ్యంగ పరమైన హక్కులు లభిస్తున్నాయని చెప్పారు. 

దేశంలో అందరితో కలిసి అందరి అభివృద్ధి కోసం అనే నినాదంతో ముందుకు పోతున్నామన్న ఆయన . అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ  మినీ ఇండియా వంటిదనీ, దేశానికే ఇది ఆదర్శమని అన్నారు.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/