ట్విట్టర్‌లో దుమ్మలేపుతున్న రాఖీ.. ఇప్పుడు ఎందుకో తెలుసా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్‌లో రాఖీ చిత్రం ఆయనకు చాలా ఊరటనిచ్చిన సినిమా అని చెప్పాలి. వరుసగా ఫెయిల్యూర్లతో సతమతమవుతున్న తారక్ ఒకానొక సమయంలో ఫేడవుట్ అయిపోతాడేమో అని అందరూ అనుకున్నారు. ఈ ఆందోళనతో తారక్ అప్పట్లో భారీగా బరువు కూడా పెరిగిపోవడంతో, తారక్ ఇక హీరోగా పనికి రాడని విమర్శకులు సైతం తేల్చేశారు. అయితే ఆ సమయంలోనే రాఖీ అనే సినిమాలో నటించాడు యంగ్ టైగర్.

క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన రాఖీ చిత్రంలో భారీ ఊబకాయంతో తారక్ కనిపించాడు. అయినా తన యాక్టింగ్‌తో ఈ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లాడు తారక్. పూర్తి సిస్టర్ సెంటిమెంట్ చిత్రంగా వచ్చిన రాఖీ చిత్రం ఓ సోషల్ మెసేజ్‌ను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడంతో సక్సె్స్ అయ్యింది. దీంతో ఈ సినిమా వరుస ఫెయిల్యూర్స్‌తో ఉన్న తారక్‌కు అదిరిపోయే విజయాన్ని అందించింది. ఇక ఈ సినిమా రిలీజ్ అయ్యి నేటికి 14 ఏళ్లు పూర్తయిన సంద్భంగా ఈ సినిమా ప్రస్తుతం సోషల్ మీడియా వేదిక ట్విట్టర్‌లో ట్రెండింగ్‌లో ఉంది.

14YearsForRakhi అనే హ్యాష్‌ట్యాగ్‌తో రాఖీ సినిమా ఇప్పుడు ట్రెండింగ్ అవుతుండటంతో నందమూరి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కృష్ణవంశీ టేకింగ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ యాక్టింగ్, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం కలగలిసి ఈ సినిమాకు భారీ విజయాన్ని అందించాయి. ఇక ఈ సినిమాలో ఇలియానా, ఛార్మీలు హీరోయిన్లుగా నటించిన సంగతి తెలిసిందే. కాగా ప్రస్తుతం తారక్ టాలీవుడ్‌లోని ప్రెస్టీజియస్ మల్టీ్స్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే.