ప్రపంచంపై గుత్తాధిపత్యమే తమ లక్ష్యం అన్న హమాస్ కమాండర్ అల్ జహార్

తొలి టార్గెట్ ఇజ్రాయెల్ అని వ్యాఖ్య

Entire Planet Will Be Under Our Law, Warns Hamas Commander Mahmoud Al-Zahar

టెల్ అవీవ్: ఓవైపు ఇజ్రాయెల్ – పాలస్తీనా (గాజా స్ట్రిప్) మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. మరోవైపు గాజా మిలిటెంట్ గ్రూప్ హమాస్ కమాండర్ మహ్మౌద్ అల్ జహార్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రపంచంపై గుత్తాధిపత్యాన్ని సాధించడమే హమాస్ లక్ష్యం అని ఆయన చెప్పారు. హమాస్ లక్ష్యాల గురించి ఆయన వెల్లడిస్తున్న ఒక వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది. తమ తొలి టార్గెట్ ఇజ్రాయెల్ అని… ఆ తర్వాత యావత్ ప్రపంచం మీద దృష్టి సారిస్తామని చెప్పారు. ఈ భూభాగం మొత్తం తమ చట్టం కిందే ఉంటుందని అన్నారు.

510 మిలియన్ చదరపు కిలోమీటర్ల భూమి మొత్తం మన వ్యవస్థ కిందకు వస్తుందని… ఆ వ్యవస్థలో పాలస్తీనీయులతో పాటు లెబనాన్, సిరియా, ఇరాక్ ఇతర దేశాల్లోని అరబ్బులపై జరగుతున్న అన్యాయం, అణచివేత, హత్యలు వంటివి ఉండవని అల్ జహార్ చెప్పారు.

ఈ వీడియో వైరల్ అయిన వెంటనే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ఘాటుగా స్పందించారు. హమాస్ ను కూకటి వేళ్లతో పెకిలిస్తామని ఆయన అన్నారు. పాలస్తీనియన్ గ్రూపులో ఉన్న ప్రతి ఒక్కరూ చచ్చినవారేనని వ్యాఖ్యానించారు.