ఎన్‌కౌంటర్‌..ముగ్గురు ఉగ్రవాదుల హతం

terrorists killed in encounter in Jammu and Kashmir
terrorists killed in encounter

శ్రీనగర్‌‌: జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. తాజాగా గురువారం ఉదయం బటమలూ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారం మేరకు సీఆర్‌పీఎఫ్‌, పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో బలగాలపైకి కాల్పులు జరిపారు. దీంతో బలగాలు ఎదురుకాల్పులు జరపడంతో మొదట ఓ తీవ్రవాది హతమయ్యాడు. అనంతరం సెర్చ్‌ ఆపరేషన్‌ను కొనసాగించి.. మరో ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు కాశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. ఇంకా ఆపరేషన్‌ను కొనసాగిస్తున్నట్లు తెలిపారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/