నెల్లూరులో బర్డ్‌ ఫ్లూ కలవరం.. అధికారులు అప్రమత్తం

Bird flu outbreak in Nellore

అమరావతిః ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో బర్డ్‌ఫ్లూ కలకలం రేగింది. వేలాది కోళ్లు ఉన్నట్టుండి చనిపోతుండడంతో అప్రమత్తమైన పశుసంవర్ధకశాఖ అధికారులు మృతి చెందిన కోళ్ల శాంపిళ్లు సేకరించి పరీక్షల కోసం భోపాల్ పంపారు. కోళ్ల మృతికి బర్డ్ ఫ్లూ కారణమని పరీక్షల్లో నిర్ధారించినట్టు తెలుస్తోంది.

మరోవైపు, బర్డ్ ఫ్లూ కారణంగా కోళ్లు చనిపోతున్నాయన్న ప్రచారంతో చికెన్ కొనుగోళ్లు అమాంతం పడిపోయాయి. దీంతో చికెన్ సెంటర్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. ఫలితంగా చికెన్ ధరలు అమాంతం పడిపోయాయి. నెల్లూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో మాత్రం బర్డ్ ఫ్లూకు సంబంధించి ఎలాంటి కేసులు నమోదు కాలేదు.