హెల్మెట్‌ను ఏనుగు మింగేసింది! నేను ఎలావెళ్ళాలి ?

లబోదిబో మన్న బాధితుడు: వీడియో పోస్ట్ వైరల్

An elephant gobbling up a helmet
An elephant gobbling up a helmet

అసోం గువహాటిలోని స‌త్గావ్ ఆర్మీ క్యాంపు వ‌ద్ద ఓ ఏనుగు చేసిన పని ఇపుడు వైరల్ అయింది . బైక్ ఫై ఉన్న ఓ హెల్మెట్‌ను తొండంతో తీసుకుని అమాంతంగా నోట్లోకి లాగేసుకుంది. ఆ తర్వాత ఏనుగు అక్క‌డ్నుంచి మెల్ల‌గా వెళ్లిపోయింది. ఈ దృశ్యాల‌ను హెల్మెట్ య‌జ‌మాని త‌న సెల్‌ఫోన్‌లో చిత్రీక‌రించి వైర‌ల్ చేశాడు. త‌న హెల్మెట్‌ను ఏనుగు లాగేసుకుంది.. తాను ఎలా వెళ్లాలి? అని అత‌ను వాపోయాడు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/