మా పోలింగ్ వివాదం ఫై మా ఎన్నికల అధికారి క్లారిటీ

‘మా’ ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా మా లొల్లి నడుస్తూనే ఉంది. మా ఎన్నికల్లో మంచు విష్ణు ప్యానల్ విజయ ఢంకా మోగించింది. అయితే ఈ పోలింగ్ సజావుగా సాగలేదని , అన్యాయం చేసారంటూ ప్రకాష్ రాజ్ ప్యానల్ వారు మంగళవారం ప్రెస్ మీట్ ఏర్పటు చేసి పలు విమర్శలు చేసారు.

బ్యాలెట్‌ పేపర్స్‌ను ఎన్నికల అధికారి ఇంటికి తీసుకెళ్లినట్లు ప్రకాశ్‌రాజ్‌ ప్యానల్‌ సభ్యులు ఆరోపణలు చేశారు. తాజాగా ఈ విషయం‍పై మా ఎన్నికల అధికారి కృష్ణమోషన్ స్పందించారు. యాంకర్‌ అనసూయ భారీ మెజార్టీతో గెలిచిందన్న వ్యాఖ్యల్లో నిజం లేదని, అధికారికంగా ప్రకటించక ముందే వార్తలు ఎలా బయటకు వెళ్లాయో తెలియడం లేదన్నారు.

ఇక తాను బ్యాలెట్‌ పేపర్లను తీసుకెళ్లినట్లు చేస్తున్న ఆరోపణల్లో ఏ మాత్రం నిజం లేదని పేర్కొన్నారు. తాను బ్యాలెట్‌ పేపర్ల తాళాలు మాత్రమే ఇంటికి తీసుకెళ్లానని, బ్యాలెట్‌ పేపర్లు కాదని స్పష్టం చేశారు. మరోపక్క ప్రకాష్ ప్యానల్ నుండి గెలిచిన 11 మంది సభ్యులు రాజీనామా చేసారు. విష్ణు కు మా వల్ల ఎలాంటి ఇబ్బంది జరగకూడదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.