హుజురాబాద్ ఉప ఎన్నిక వేళ..తెరాస కు భారీ షాక్

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హుజురాబాద్ ఉప ఎన్నిక వేడి నడుస్తుంది. తెరాస పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ఎన్నికలను తీసుకున్న సంగతి తెలిసిందే. ఎలాగైనా ఈటెల రాజేందర్ ను ఓడించాలని కంకణం కట్టుకున్న కేసీఆర్..ఎక్కడ లేని విధంగా హుజురాబాద్ నియోజకవర్గం కోసం భారీ నిధులు , సంక్షేమ పధకాలను తీసుకొచ్చారు. ప్రస్తుతం పోలింగ్ సమయం దగ్గర పడుతుండడం తో ప్రచారంలో బిజీ అయ్యారు. ఈ క్రమంలో తెరాస పార్టీ కి పెద్ద షాక్ తగిలింది.

మంత్రి గంగుల కమలాకర్‌..కరోనా బారినపడ్డారు. గత రెండు రోజుల నుంచి జలుబు, జ్వరంతో బాధపడుతున్న మంత్రి.. తాజాగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా ..పాజిటివ్‌గా తేలింది.. దీంతో హోం ఐసోలేషన్‌లోకి వెళ్లిపోయిన మంత్రి గంగుల కమలాకర్‌.. ఈ మధ్య తనను కలిసినవారు, సన్నిహితంగా మెలిగిన ప్రతి ఒక్కరూ.. టెస్ట్‌లు చేయించుకోవాలని కోరారు. మంత్రి కరోనా బారిన పడడం తో తెరాస కార్య కర్తలు షాక్ లో పడ్డారు. ఎన్నికల వేళ మంత్రి కరోనా బారినపడడం తో ప్రచారానికి ఇబ్బంది గా మారింది.

హుజురాబాద్ ఉప ఎన్నిక‌కు సంబంధించి నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ గ‌డువు నేటితో ముగియ‌నున్న‌ది.  ఈరోజు సాయంత్రం గుర్తుల‌ను కేటాయించ‌నున్నారు.  ప్ర‌స్తుతానికి బ‌రిలో 42 మంది అభ్య‌ర్థులు ఉన్నారు.  ఇందులో ఎంత‌మంది నామినేష‌న్ల‌ను ఉప‌సంహ‌రించుకుంటారు అన్న‌ది తెలియాల్సి ఉన్న‌ది.  ఉద‌యం 11 గంట‌ల నుంచి సాయంత్రం 3 గంట‌ల వ‌ర‌కు ఉప‌సంహ‌ర‌ణ‌కు స‌మ‌యం ఉన్న‌ది.   పోటీనుంచి త‌ప్పుకునే వారు నేరుగా సంత‌కం పెట్టి నామినేష‌న్‌ను వెన‌క్కి తీసుకోవాలి.  అధికార టీఆర్ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్ నుంచి ముగ్గురు, 32 మంది స్వ‌తంత్రులు, 7 మంది ఇత‌ర పార్టీల‌కు చెందిన అభ్య‌ర్థులు బ‌రిలో ఉన్నారు.